మీరు మద్యం తాగుతున్నారా..? అయితే, ఒక్కసారి పూర్తిగా ఈ ఆర్టికల్ చదవండి. తాజాగా చేసిన ఓ అధ్యయనంలో కొన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఈ రోజుల్లో మద్యం తాగడం అనేది ఓ ఫ్యాషన్ గా మారిపోయింది. తాగే అలవాటు లేని వ్యక్తులను చూసి తాగే వ్యక్తులు ఓ రకంగా చూస్తుంటారు. వారిని అందరి ముందు హేళన చేసి మాట్లాడుతుంటారు. అంతేకాకుండా మద్యం తాగకపోతే అసలు మగాడే కాదన్న రీతిలో లెక్చర్స్ ఇస్తుంటారు. అయితే, కొందరు రోజూ మద్యం తాగితే.., మరి కొందరు మాత్రం అప్పుడప్పుడు తాగుతుంటారు. ఏదేమైనా మద్యం తాగితే డేంజర్ అని ఇప్పటకీ ఎంతో మంది నిపుణులు చెబుతూనే ఉన్నారు. అయినా అస్సలు లెక్క చేయకుండా అలాగే తాగి ఉగుతుంటారు. ఇదిలా ఉంటే, ఓ యూనివర్సిటీ చేపట్టిన తాజా అధ్యయనంలో మాత్రం కొన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.
విషయం ఏంటంటే? ఆక్స్ ఫర్డ్ పాపులేషన్ హెల్త్, పెకింగ్ యూనివర్సిటీ ఇటీవల 5 లక్షల మంది మద్యం తాగే వ్యక్తులపై ఓ అధ్యయనం చేసింది. ఈ పరిశోధనలో కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తుంది. మద్యం తాగే వారు ప్రత్యక్షంగా 61, పరోక్షంగా 206 వ్యాధులకు కారణమవుతారని తెలిపింది. ఇక మద్యం తాగడం ద్వారా మొత్తం 28 రకాల రోగాలకు కారణం కావచ్చని కూడా సర్వే రిపోర్టులో పొందుపరిచింది. ఈ సంస్థ సర్వేలో భాగంగా 12 ఏళ్ల ఆస్పత్రి రికార్డులను పరిశీలించింది. ఇందులో మద్యం తాగే వ్యక్తులకు రోగనిరోదక వ్యవస్థ, పోషక, జీవ క్రియ సంబంధిత వ్యాధులు, క్యాన్సర్లు, నాడీ సంబంధిత వ్యాధులు, చర్మంతో పాటు కండరాలు వంటి భాగాల్లో అనేక రకాల జబ్బులు సోకి ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించింది. మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే? మద్యం కారణంగా ఏడాదికి 30 లక్షల మంది చనిపోతున్నారని కూడా తాజా సర్వేలో తేలపడం విశేషం. ఇది తెలుసుకున్న కొందరు మందు బాబులు షాక్ గురై ఆలోచనలో పడ్డారు.