నేటికాలంలో మద్యం తాగే వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. ప్రభుత్వాలకు వస్తున్న ఆదాయంలో ఎక్కువ భాగం ఈ మద్యం నుంచే వస్తుంది. కొందరికి మద్యం చుక్క పడనిదే రోజు ప్రారంభం కాదు. అలానే చాలా మంది స్నేహితులు పార్టీలు చేసుకుంటున్నారంటే మద్యం తప్పనిసరిగా ఉంటుంది. తాజాగా మద్యం ప్రియులకు ఓ శుభవార్త వచ్చింది.
నేటికాలంలో మద్యం తాగే వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. ప్రభుత్వాలకు వస్తున్న ఆదాయంలో ఎక్కువ భాగం ఈ మద్యం నుంచే వస్తుంది. కొందరికి మద్యం చుక్క పడనిదే రోజు ప్రారంభం కాదు. అలానే చాలా మంది స్నేహితులు పార్టీలు చేసుకుంటున్నారంటే మద్యం తప్పనిసరిగా ఉంటుంది. ఇలా మందు తాగి తెగ చిందులేస్తూ జీవితాన్ని గడిపేస్తుంటారు. మద్యం ప్రియులకు తరచూ రాష్ట్ర ప్రభుత్వాలు శుభవార్తలు చెప్తుంటాయి. ప్రత్యేక రోజుల్లో మద్యం దుకాణల సమయం పెంచడం, రేట్లు తగ్గించడం వంటివి చేస్తుంటాయి. తాజాగా మద్యం ప్రియులకు మరో శుభవార్త చెప్పింది పుదుచ్చేరి ప్రభుత్వం.. ఇక నుంచి కొన్ని రకాల బస్సులో కూడా బీర్ల సదుపాయం కల్పించింది. మరి.. ఈ వివరాలు ఏమిటో ఇప్పుడు చుద్దాం..
వేసవి కాలంలో బీచ్‌లు వంటి ప్రాంతాలకు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగానే పలు రాష్ట్రాల్లో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక సదుపాయాలను ప్రకటిస్తున్నాయి. దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో పుదుచ్చేరి కూడా ఒకటి. గోవా తరహాలో పుదుచ్చేరి యువతను ఎక్కువగా ఆకర్షిస్తున్న పర్యాటక ప్రాంతం ఉంది. ఈ క్రమంలో పుదుచ్చేరి ఓ కీలక నిర్ణయం తీసుకుంది. మందుబాబులను ఆకర్షించేందుకు కాటమరాన్ బ్రూయింగ్ కంపెనీ బీర్ బస్సును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.
ప్రస్తుతం ఈ సర్వీస్ చెన్నై నుండి పుదుచ్చేరికి మాత్రమే అందించబడుతుంది. తాజాగా కాటమరాన్ బ్రూయింగ్ కంపెనీ హాప్ ఆన్ బ్రూవరీ టూర్ బస్సు లేదా బీర్ బస్సును ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ బస్సులను ఏప్రిల్ 22న పరిచయం చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది కూడా వీకెండ్ లో చెన్నై నుండి పుదుచ్చేరికి ఒక రోజు ప్యాకేజీ. ఈ ప్యాకేజీలో 120 నిమిషాల పాటు అపరిమిత బీర్ సేవలతో పాటు రుచికరమైన భోజనం మూడు పూట అందించనున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. టూరిస్ట్ లో వారు ఎంపిక చేసుకున్న ప్రాంతాల ఆధారంగా ఒకటి లేదా రెండు ప్రదేశాలకు తీసుకెళ్తారు.
ఇక ఈ బీర్ బస్సులు శని, ఆదివారాల్లో మాత్రమే నడుస్తాయి. 35 నుండి 40 మంది పర్యాటకుల బృందాన్ని చెన్నైలోని ఒక ప్రాంతం నుండి ఉదయం 10.30 గంటలకు బయలుదేరి..అదే రోజు రాత్రి 9 గంటలకు తిరిగి చెన్నైకి చేరుస్తారు. ప్రభుత్వ నిబంధనలు ప్రకారం బస్సు ప్రయాణ సమయంలో బీరు అందించబడదు. అయితే ఇది పుదుచ్చేరిలోని బ్రూవరీలో అందించబడుతుందని సంస్థ ధృవీకరించింది. మరి.. పుదుచ్చేరిలో ప్రవేశపెట్టనున్న ఈ బీర్ బస్సుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.