తాగిన మత్తులో మందుబాబులు కొట్టుకోవడం గురించి వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అయితే ఒక బార్లో సిబ్బందికి, మందుబాబులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అది కాస్తా పెద్ద గొడవగా మారింది.
మద్యపాన నిషేధం కోసం ఎన్నో ఏళ్లుగా చాలా మంది పోరాటం చేస్తున్నారు. అయితే అది సాధ్యం కావడం లేదు. చాలా రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు ఎన్నికలకు ముందు మద్యపానాన్ని నిషేధిస్తామంటూ హామీలు ఇస్తున్నాయి. కానీ పవర్లోకి వచ్చాక ఆ హామీని పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. పెట్రోల్, డీజిల్‌తో పాటు మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం భారీగా ఉండటంతో దాన్ని బ్యాన్ చేయడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏదేమైనా.. మద్యం బారిన పడి ఎందరో తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. యువత కూడా ఆల్కహాల్‌కు బానిసలుగా మారుతున్నారు. మద్యం మత్తులో మందుబాబులు వీరంగం చేసిన ఘటనల గురించి వార్తల్లో చూస్తూనే ఉన్నాం.
తాజాగా అలాంటి ఓ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. బార్లో సిబ్బందికి, కస్టమర్లకు నడుమ తీవ్ర వాగ్వాదం జరిగింది. శుక్రవారం సాయంత్రం ముంబైలో జరిగిన ఈ ఘటనలో.. బార్ సిబ్బంది, కస్టమర్లు ఒకరినొకరు చెప్పులతో కొట్టుకున్నారు. ఒకరి మీద ఒకరు కుర్చీలు కూడా విసురుకున్నారు. ఈ ఫైట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ ఘటన గురించి తెలియగానే పోలీసులు రంగంలోకి దిగి, పది మందిని అరెస్ట్ చేశారు. ఈ మేరకు తాము కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు గల కారణాలు ఏంటనేది తెలియాల్సి ఉంది.
Mumbai Bar Brawl Caught On Camera, 10 Arrested
Read here: https://t.co/djgS4TaDUJ pic.twitter.com/3nTUca4O7f
— NDTV Videos (@ndtvvideos) April 8, 2023