ఎంతో కష్టపడి చదివి డిగ్రీలు, పీజీలు చేసిన వారి సంఖ్య రోజు రోజుకు ఎక్కువవుతోంది. పైగా చదివిన చదువుకి కోరుకున్న ఉద్యోగం దొరుకుతుందా అంటే అదీ లేదు. దీంతో అనేక మంది నిరుద్యోగులు తాము అనుకున్న రంగాల్లో స్థిరపడలేక డబ్బుల కోసం ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడిపోతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా అమెరికాకు చెందిన ఓ సంస్థ ఉద్యోగ నోటీఫికేషన్ ను విడుదల చేసింది. అన్ని ఉద్యోగాల మాదిరిగానే ఇందులో కూడా కష్టపడి చేయాల్సిందే కదా అని మాత్రం అనుకోకండి.
అసలు ఈ జాబ్ లో సెలక్టైన ఉద్యోగి చేయాల్సిన పని ఏంటో తెలిస్తే అవాక్కవుతారు. అవును మీరు విన్నది నిజమే. అంతలా ఆశ్చర్యపోవడానికి ఏమైన కుర్చుని తినే ఉద్యోగమా అని అనుకుంటున్నారా? అవును మీరు అనుకుంటున్నది నిజమే. ఉత్తర అమెరికాలోని ఆన్‌లైన్ క్యాండీ రిటైలర్ అనే కంపెనీ తమ సంస్థకి చీఫ్ కాండీ ఆఫీసర్ పోస్ట్ కోసం ఉద్యోగి కావాలని జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇక ఆ ఉద్యోగి చేయాల్సింది ఏంటంటే? సంస్థలో తయారైన చాక్లెట్ ను రుచి చూస్తే చాలు అంటోంది. ఈ ఉద్యోగానికి అప్లయ్ చేసుకోవాలనుకునేవారు ఐదేళ్లు నిండిన వారు అర్హులు అని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో పాటు ఏడాదికి రూ.1 లక్ష డాలర్ల జీతం ఇస్తామని కంపెనీ తెలిపింది. ఈ కంపెనీ ప్రకటనతో అక్కడున్న కొందరు యువకులు పోటీ పడి అప్లయ్ చేస్తున్నారట. రుచి చూస్తే నెలకు రూ.6 లక్షలు ఇస్తున్న ఈ ఉద్యోగంపై మీ అభిప్రాయలను కామెంట్ రూపంలో తెలియజేయండి.