ఆయన్నిఅందరూ రెయిన్‌బో షేక్ అని ముద్దుగా పిలుస్తారు. మెర్సిడస్ కంపెనీకి చెందిన బెంజ్ ఎస్-క్లాస్ కార్లు ఏడింటిని కొని వాటికి ఇంద్రధనస్సు రంగులు వేయించారు. వారంలో రోజుకో రంగు కారులో తిరిగేవారు. అందుకే ఈయనకు కార్లంటే ఎంతో ఇష్టం. ప్రస్తుతం ఈయన గ్యారేజ్‌లో మూడు వేల కార్లు ఉన్నాయి. అసలు పేరు హమద్ బిన్ హమ్దాన్ అల్ నహ్యాన్ అబుదాబి రాజు, యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కి మొదటి అధ్యక్షుడి కొడుకు. వేల కోట్ల ఆస్తులకు అధిపతి. వ్యాపారవేత్త. అతడి రాజకుటుంబానికి చెందిన హమద్ వేల్స్ విశ్వ విద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీ పొందారు. అలాగే ఎమిరేట్స్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రంలో పట్టా అందుకున్నారు.
ప్రపంచంలోని అత్యంత ఖరీదైన,కార్లు హమద్ గ్యారేజ్‌లో ఉన్నాయి. అలాగే వింటేజ్ కార్లు కూడా బోలెడు ఉన్నాయి. లంబోర్గిని తయారుచేసిన అత్యంత విలాసవంతమైన కారు అతని ఉందే ఉంది. అలాగే ప్రపంచంలో అతిపెద్దదైన జీప్ కూడా ఆయన దగ్గర ఉంది. డాడ్జ్ పవర్ వేగన్ కంటే ఆ జీపు 64 రెట్లు పెద్దది. హమద్ తన కార్ల కోసం ప్రత్యేకంగా ఓ మ్యూజియాన్నే ఏర్పాటు చేశారు. వాటిని చూడడానికి వెళ్లే వాళ్లు వాటిని ఉచితంగా నడపొచ్చు కూడా. అయితే అందుకు కావల్సిన పెట్రోల్‌ను మాత్రం వాళ్లే నింపుకోవాల్సి ఉంటుంది. కాగా,
హమద్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. అయితే ఆయన కార్ల గురించే ఎక్కువగా పోస్ట్‌లు పెడుతుంటారు. కార్లతో పాటు ఆయనకు ఓ సొంత విమానం కూడా ఉంది. విలాసవంతమైన జీవితం గురించి వింటే ఎంతటి వారికైనా అసూయ పుడుతుంది.