కారు కొనడం అనేది కచ్చితంగా చిన్న విషయం కాదు. వివిధ రకాల మోడల్స్, ధరలు, ఫీచర్స్ తో కార్లు ఉంటాయి. వాటిలో మీకు ఏది కావాలో నిర్ణయించుకోవడం కష్టంగానే ఉంటుంది. పైగా నెలకొ మోడల్ రిలీజ్ అవుతూ ఉంటుంది. వాటిలో ఏ కారు సెలక్ట్ చేసుకోవాలో మీకు కూడా అర్థం కాదు.
కారు కొనడం అంటే అంత తేలికైన విషయం కాదు. ముందుగా మీ అవసరానికి ఏ కారు సూట్ అవుతుందో తెలుసుకోవాలి. ఆ తర్వాత ఆ కారు మీ బడ్జెట్ లో ఉందో లేదో చూసుకోవాలి. దానిలో ఎలాంటి వేరియంట్స్ ఉన్నాయి? ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి అనే విషయం కూడా మీకు తెలిసుండాలి. ఏడాదిలో చాలా కార్లు విడుదలవుతూ ఉంటాయి. అలా ఈ నెలలో కొన్ని మోడల్ కార్లు విడుదలవుతున్నాయి. మీకు కారు కొనే ఉద్దేశం ఉంటే వాటిలో మీకు సెట్ అయ్యే మోడల్ ఉందోమో ఓ లుక్కేయండి. అలాగే వాటి ధర, స్పెసిఫికేషన్స్ కూడా పూర్తిగా తెలుసుకోండి.
మారుతీ అంటేనే మిడ్ రేంజ్ కార్లని అందరికీ తెలుసు. మంచి ఫీచర్స్, కంఫర్ట్ ఉండే కార్లని సాధ్యమైనంత తక్కువ ధరలో అందిస్తుంటుంది. అలాగే ఇప్పుడు థార్ కి రైవల్ గా జిమ్మీని తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మార్కెట్ లో జిమ్మీకి క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ కారు మే నెలలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇది 5 డోర్ వెర్షన్ లో వస్తోంది. 4*4 డ్రైవ్ స్టాండర్డ్స్ లో ఉంటుంది. 1.5 పెట్రోల్ ఇంజిన్, 5 స్పీడ్ మాన్యువల్, 4 స్పీడ్ ఆటోమేటిక్ వర్షన్స్ లో ఈ జిమ్మీ రాబోతోంది. క్రూయిస్ కంట్రోల్, ఆటోమేటిక్ ఏసీ, 9 ఇంచెస్ టచ్ స్క్రీన్, రేర్ పార్కింగ్ కెమెరా, 6 ఎయిర్ బ్యాగ్స్ తో వస్తోంది. దీని ప్రారంభ ధర రూ.10 లక్షలుగా ఉంటుందని భావిస్తున్నారు.
టాటా నుంచి అల్ట్రోజ్ కార్ సీఎన్జీలో విడుదల కానుంది. మే నెల తొలి రెండు వారాల్లోనే విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందులో డ్యూయల్ సిలిండర్ సీఎన్జీ సెటప్ అందరినీ ఆకట్టుకుంటోంది. మిగతా సీఎన్జీలతో పోల్చుకుంటే దీని వల్ల ఎక్కువ బూట్ స్పేస్ లభిస్తుంది. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్- సీఎన్జీ ఇంజిన్ ఉంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ తో వస్తోంది. దీని ధర రూ.6.44 లక్షల నుంచి ప్రారంభం కావచ్చు.
ఇటీవలే హ్యూండాయ్ కంపెనీ ఎక్స్ టర్ అనే మోడల్ ని రిలీచ్ చేసిన విషయం తెలిసిందే. ఇది భారత్ లో తయారయ్యి విదేశాలకు కూడా ఎక్స్ పోర్ట్ అవుతుందని చెబుతున్నారు. నిజానికి ఈ మైక్రో ఎస్యూవీ లుక్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. పైగా ధర కూడా రూ.6 లక్షల నుంచి ప్రారంభం కావచ్చని చెబుతున్నారు. ఇందులో ఎలక్ట్రిక్ సన్ రూఫ్, పెద్ద టచ్ స్క్రీన్, క్రూయిస్ కంట్రోల్, వైర్ లెస్ ఛార్జర్, 6 ఎయిర్ బ్యాగ్స్, రేర్ కెమెరా ఉండే అవకాశం ఉంది. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉండే అవకాశం ఉంది. దీనిలో మాన్యువల్, ఆటోమేటిక్ వర్షన్స్ ఉంటాయి.
కియా కంపెనీ నుంచి వచ్చిన సెల్టాస్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు సెల్టాస్ నుంచి 2023 మోడల్ మే నెలలో రిలీజ్ అవుతుందని చెబుతున్నారు. ఒరిజినల్ మోడల్ ని మార్చకుండానే ఇంటీరియర్- ఎక్స్ టీరియర్ లుక్స్ బాగా మార్చే అవకాశం ఉంది. ఈ మోడల్ లో ఇప్పటికే రిచ్ క్యాబిన్ ఉంది. అందుకు అదనంగా డ్యూయల్ 10.25 టచ్ స్క్రీన్ ఉండే అవకాశం ఉంది. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్లను కంటిన్యూ చేస్తున్నారు. దీని ప్రారంభం ధర రూ.10 లక్షలుగా ఉండచ్చు.