పాకిస్తాన్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విహార యాత్రకు వెళ్లిన కుటుంబాల్లో తీరని శోకం మిగిలింది. మంచు వర్షం వల్ల ఊపిరాడక 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ వివరాలు.. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ కు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముర్రే శీతాకాలంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా వర్ధిల్లుతుంది. ఇక్కడి పర్యాటక అందాలను చూడటానికి ప్రతి ఏటా లక్షల మంది పర్యాటకులు ఇక్కడకు వస్తారు. శీతాకాలం కావడంతో ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటాయి. దాంతో ఎప్పుడు మంచు కురుస్తుండటంతో.. రోడ్లన్ని మంచు దుప్పటిని కప్పుకుంటాయి. ఈ క్రమంలో శుక్రవారం ఇక్కడ ఉష్ణోగ్రతలు అత్యంత దారుణంగా పడిపోయాయి. ఏకంగా మైనస్ 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది.
NHMP team led by DIG/Zonal Commander N5 North working tirelessly in the dark inclement weather, snow and rain to help and rescue the distressed commuters and ensure smooth flow of traffic on the Murree Expressway.
Well done team NHMP! pic.twitter.com/wN9Ne1zyFs— Inam Ghani QPM & Bar, PSP (@InamGhani) January 7, 2022
ఫలితంగా భారీగా మంచు వర్షం కురిసింది. రోడ్లపై ఏకంగా నాలుగు అడుగుల మేర మంచు పేరుకుపోయింది. దీంతో పర్యాటకుల వాహనాలన్నీ మంచులో చిక్కుకుపోయాయి. రాత్రంతా మంచు వర్షం కురిసి వాహనాలను కూడా కప్పేసింది. ఈ క్రమంలో కారులో కూర్చున్న వారు విండోలు కూడా తీయడానికి వీల్లేకుండా మారింది. ఫలితంగా సుమారు 16 మంది కారులోనే ఊపిరాడక మరణించారు. వీరిలో ఇస్లామాబాద్ పోలీసు అధికారితో పాటు ఆయన కుటుంబ సభ్యులు మరో 8 మంది ఉన్నారు. వీరంతా హైపోథెర్మియాతో ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి : ప్రధాని భార్య కారుపై కాల్పులు
ప్రస్తుతం ముర్రే మార్గంలో అధికారులు సహాయక చర్యలు నిర్వహిస్తున్నారు. వెయ్యికిపైగా వాహనాలను మంచు నుంచి బయటకు తీశారు. మరో వెయ్యి వాహనాలు.. మంచులోనే చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. ముర్రే ప్రాంతంలో ఎమర్జెన్సీ ప్రకటించింది పాక్ ప్రభుత్వం. ముర్రేలో నెలకొన్న పరిస్థితులుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కొన్ని రోజుల పాటు ముర్రేకు పర్యాటకలు రావొద్దని దేశ జాతీయ హైవేలు, మోటార్ వే పోలీసు ఉన్నతాధికారి ప్రజలను అభ్యర్థించారు. ఈ విషాద సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
وزیراعلیٰ @UsmanAKBuzdar کا مری میں ایمرجنسی کےنفاذ کا اعلان: مری کو آفت زدہ قراردےدیا
•مری اور ملحقہ علاقوں میں تمام ریسٹ ہاؤسز اور سرکاری اداروں کوسیاحوں کیلئےکھول دیاگیاہے
•وزیراعلی نےاپنا ہیلی کاپٹر بھی ریسکیوسرگرمیوں کےلئےدےدیاموسم بہترہوتے ہی امدادی سرگرمیوں میں حصہ لےگا pic.twitter.com/o5sdTH8lD8— Government of Punjab (@GovtofPunjabPK) January 8, 2022
ఇది కూడా చదవండి : పాక్ క్రికెట్ బోర్డు నిర్లక్ష్యం.. క్రికెటర్లకు ఘోర అవమానం!