అందాల పోటీలు అంటే.. మచ్చలేని సుందరమైన రూపం, తీరైన కనుముక్కు, పొందికైన శరీర సౌష్టవం ఇవే గుర్తుకు వస్తాయి ఎవరికైనా. ఈ పోటీల తీరు కూడా ఇలానే సాగుతుంది. మహిళల శరీరాకృతికే ఈ పోటీల్లో అధిక ప్రాధాన్యత ఇస్తారనే అపవాదు కూడా ఉంది. కానీ ఏది ఏమైనా.. అందానికి ఎవరు ఎన్ని కొలతలు గీసినా.. అసలు సౌందర్యం మాత్రం మనలోని ఆత్మవిశ్వాసం మీదనే ఆధారపడి ఉంటుంది. ఆత్మ విశ్వాసమే మనిషికి అసలు సిసలు అందాన్ని ఇస్తుంది.
ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచారు శ్రీషైనీ. ఇంతకు ఎవరు ఈమె అనుకుంటున్నారా.. మిస్ అమెరికాగా గెలిచి..మిస్ వరల్డ్ పోటీలో తొలి రన్నరప్‌గా నిలిచింది. మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. శ్రీషైనీ భారత సంతతి యువతి. ఆమె స్వస్థలం పంజాబ్‌లోని లూథియానా. శ్రీషైనీకి ఐదేళ్ల వయసులో ఆమె కుటంబం అమెరికా వచ్చేసింది. అక్కడే స్థిరపడ్డారు. శ్రీషైనీ విద్యాభ్యాసం అంతా అమెరికాలోనే సాగింది.
ఇది కూడా చదవండి: ఎయిడ్స్ ని జయించిన మొట్ట మొదటి మహిళ
మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా శ్రీషైనీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ పోస్ట్ ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. దీనిలో ఆమె ‘‘మిస్ వరల్డ్ పోటీల్లో నేను నా తరఫున మాత్రమే కాక.. 333 మిలియన్ల మంది అమెరికన్లకు, బిలియన్ల మంది భారతీయ వలసదారులకు ప్రాతినిధ్యం వహిస్తున్నాను. నా కథ కొందరిలోనైనా స్ఫూర్తి నింపుతుందనే ఉద్దేశంతో ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఐదేళ్ల వయసులోనే నేను ఇండియా నుంచి అమెరికా వచ్చాను. 12 ఏళ్ల వయసులో నాకు అరుదైన గుండె సమస్య ఉందని గుర్తించారు. పేస్‌మేకర్ అమర్చారు. ఇక చిన్నప్పటి నుంచే నాకు అందాల పోటీలంటే విపరీతమైన ఆసక్తి. ఆరో ఏట నుంచే మిస్ట్ వరల్డ్‌గా డ్రెస్ చేసుకునేదాన్ని. నా దృష్టిలో మిస్ వరల్డ్ అంటే ఓ సూపర్ హీరో. మంచి మనసుతో ఎందరికో సేవ చేసే వ్యక్తి. భవిష్యత్తులో నేను కూడా మిస్ వరల్డ్ కావాలని కలలు కనేదాన్ని. నాతోపాటు.. ఆ కోరిక కూడా పెరుగుతూ వచ్చింది’’ అని తెలిపారు.
ఇది కూడా చదవండి: సముద్రంలో హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్! వీడియో వైరల్!
‘‘ఇలా ఉండగానే నా జీవితంలో అనుకోని కుదుపు. యూనివర్శిటీలో చదువుతుండగా.. నేను కారు ప్రమాదానికి గురయ్యాను. ఈ ఘటనలో నా ముఖం పూర్తిగా దెబ్బతిన్నది. నన్ను నేనే గుర్తుపట్టలేనంతగా నా ముఖం మారిపోయింది. తనివితీరా ఏడ్వాలన్నా కుదిరేది కాదు. నా కన్నీళ్లు.. గాయాల మీదుగా కిందకు జారినప్పుడు అవి మరింత మండేవి. అందుకే ఏడ్వడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. కానీ నేను ధైర్యాన్ని కోల్పోలేదు. వైద్యుల శ్రమ, మంచి మందులు, పోషకాహారం సాయంతో నేను కోలుకున్నాను. పూర్వ రూపం పొందగలిగాను’’ అని చెప్పుకొచ్చారు శ్రీషైనీ.
ఇది కూడా చదవండి: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి కారణం ఏమిటి?
‘‘ఈ ప్రమాదం తర్వాత నాలో ఆత్మవిశ్వాసం రెట్టింపయ్యింది. కోలుకున్న తర్వాత అందాలపోటీల మీద పూర్తిగా దృష్టి కేంద్రీకరించాను. మిస్ అమెరికా కిరీటం గెలుచుకున్నాను. మిస్ వరల్డ్ 2021లో అమెరికా తరఫున ప్రాతినిధ్యం వహించాను. జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి. కానీ అన్నింటికంటే పెద్ద కష్టం.. ఎవరు తీర్చలేనది.. జీవించి ఉండటం. బతికున్నామంటే చాలు. ఏదైనా సాధించవచ్చు. జీవించి ఉన్నందుకు కృతజ్ఞతగా ఉండాలి. ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కష్టాలను కూడా ఇష్టాలుగా భావించాలి. జీవితంలో వెలుగును చూడాలి’’ అని చెప్పుకొచ్చారు శ్రీషైనీ. ఆమె పోస్ట్ చూసిన నెటిజనులు.. ‘‘మీ ఆత్మవిశ్వాసానికి హ్యాట్సాఫ్.. మీ జీవితం ఎందరికో ఆదర్శం’’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. శ్రీషైనీ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.