ఓ 10-15 ఏళ్ల క్రితం వరకు అందాల పోటీలు అంటే.. కేవలం నార్త్ ఇండియన్స్ అన్నట్లుండేవి పరిస్థితులు. ప్రస్తుతం మన తెలుగమ్మాయిలు కూడా అందాల పోటీల్లో పాల్గొనడానికి ఆసక్తి చూపుతున్నారు. తాజాగా ఏపీకి చెందిన యువతి మిస్ ఇండియా పోటీలకు ఎన్నికైంది. ఆ వివరాలు..
జీవితంలో చిన్న చిన్న కష్టాలకే కుంగిపోయి.. ఆత్మహత్య వంటి దారుణాలకు పాల్పడుతున్న వారి గురించి నిత్యం అనేక వార్తలు చదువుతున్నాం. మరీ దారుణం ఏంటంటే.. సోషల్ మీడియా పోస్టులకు లైక్‌లు రావడం లేదనే కారణంగా ఆత్మహత్య చేసుకున్నవారు కూడా మన సమాజంలో ఉన్నారు. అలాంటి ఘటనల గురించి చదవినప్పుడు.. విన్నప్పుడు.. అరే మరీ ఇంత చిన్న విషయాలకే.. ప్రాణాలు తీసుకోవాలా.. అసలు వీరికి జీవితం విలువ తెలుసా అనిపిస్తుంది. కష్టాలు, బాధలు, అవమానాలు వచ్చినప్పుడు కుంగిపోతే ఎలా.. […]
ఆడవారికి వివాహం అయ్యింది అంటే.. ఇక వారి జీవితానికి ముగింపు అనేటటువంటి పరిస్థితులు ఎదుర్కొనే మహిళలు.. నేటికి కూడా మన సమాజంలో చాలా మంది ఉన్నారు. ఒక్కసారి వివాహం అయ్యిందంటే.. ఇక ఆమె జీవితం ముగిసిపోయి.. భర్త, అత్తింటివారు, పిల్లల కోసం బతకడమే ఆమె లోకంగా మారుతుంది. తన గురించి తాను ఆలోచించుకోదు.. తన ఆరోగ్యం పట్టించుకోదు.. భర్త, బిడ్డలే లోకంగా బతుకుతారు. పెళ్లికి ముందు వరకు.. తమ గురించి తాము ఎంతో శ్రద్ధ తీసుకుని.. అందంగా […]
అందం విషయంలో ఆడవారికి కాస్త శ్రద్ధ ఎక్కువ. అయితే ఈ మధ్యకాలంలో మగవారు కూడా అందానికి బాగా ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక అందాల పోటీలకుండే క్రేజే వేరు. వీటిల్లో పాల్గొని.. కిరీటం గెలుచుకోవాలని చాలా మంది కోరుకుంటారు. అందుకోసం ఏళ్ల తరబడి సిద్ధమవుతుంటారు. ఇక విశ్వ సుందరి, మిస్ ఇండియా పోటీలకు ఏటా ఎంత మంది సిద్ధమవుతుంటారో చూస్తూనే ఉన్నాం. కొన్నాళ్ల క్రితం వరకు ఇలాంటి పోటీలు అంటే తెలుగు మహిళలు పెద్దగా ఆసక్తి చూపకపోయేవారు. అయితే […]
అందాల పోటీలు అంటే.. మచ్చలేని సుందరమైన రూపం, తీరైన కనుముక్కు, పొందికైన శరీర సౌష్టవం ఇవే గుర్తుకు వస్తాయి ఎవరికైనా. ఈ పోటీల తీరు కూడా ఇలానే సాగుతుంది. మహిళల శరీరాకృతికే ఈ పోటీల్లో అధిక ప్రాధాన్యత ఇస్తారనే అపవాదు కూడా ఉంది. కానీ ఏది ఏమైనా.. అందానికి ఎవరు ఎన్ని కొలతలు గీసినా.. అసలు సౌందర్యం మాత్రం మనలోని ఆత్మవిశ్వాసం మీదనే ఆధారపడి ఉంటుంది. ఆత్మ విశ్వాసమే మనిషికి అసలు సిసలు అందాన్ని ఇస్తుంది. ఇందుకు […]