ప్రపంచ క్రీడారంలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ అంటే కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండేవారు మైక్ టైసన్. ప్రత్యర్థులను చిత్తు చేయడమే కాదు.. వారిని గాయాలపాలు కూడా చేసేవాడని ఆయనపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఈ బాక్సింగ్ లెజెండ్ విమానంలో తోటి ప్రయాణికుడిపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే..
అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో నుంచి ఫ్లోరిడా ప్రయాణమయ్యాడు బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్. ఆయనతో పాటు ఫ్లైట్ లో ఓ యువకుడు ప్రయాణిస్తున్నాడు. సడెన్ గా మైక్ టైసన్ ని చూసి అత్యుత్సాహ పడి.. అతనిని తన కెమెరాలో బంధించాడు. అంత వరకు బాగానే ఉన్నా ఆ యువకుడు చేసిన అతి మరీ ఎక్కువైంది. మైక్ టైసన్ ని వీడియో తీస్తూ.. పిచ్చి కూతలు కూస్తూ మైక్.. మైక్ అంటూ అరిచాడు. ఆ యువకుడు చేస్తున్న వింత చేష్టకు తోటి ప్రయాణీకులు సైతం ఇబ్బంది పడ్డారు. ఇది గమనించిన కోపంతో ఊగిపోయిన టైసన్.. యువకుడిపై పిడిగుద్దులు కురిపించాడు. దీంతో ఆ వ్యక్తి ముఖం పగిలింది.
దీనికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. సహనం నశిస్తే ఎవరికైనా కోపం వస్తుంది.. అందులోనూ మైక్ టైసన్ కి మరింత కోపం వచ్చింది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మైక్ టైసన్ కి చిరాకు తెప్పించే ప్రాంక్ చేసాడేమో.. అది కాస్త రివర్స్ అయ్యింది అని మరి కొంతమంది నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. తెలుగు లో వస్తున్న లైగర్ మూవీలో మైక్ టైసన్ నటించారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.