Mike Tyson: రౌడీ హీరో విజయ్ దేవర కొండ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘లైగర్’. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 25 థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. ప్రముఖ అంతర్జాతీయ బాక్సింగ్ క్రీడాకారుడు మైక్ టైసన్ ఈ సినిమాలో ఓ పాత్ర చేశారు. సినిమాకు కీలకమైన ఆ పాత్రలో తళుక్కున మెరిశారు. లైగర్‌కు ఎక్కువ హైప్ రావటానికి మైక్ టైసన్ కూడా ఓ ప్రధాన కారణం. ఇక, లైగర్ సినిమాపై మైక్ వ్యవహార శైలికి సంబంధించిన పాత వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది.
సినిమా రీలీజ్‌కు ముందు ఆ సినిమాలో తాను నటిస్తున్న సంగతి కూడా ఆయనకు గుర్తులేదు. కాన్సెప్ట్ ట్రైలర్లో తనను తాను చూసుకుని ‘‘ ఓ అది నేనా!’’ అన్న ఎక్స్ప్రెషన్స్ పెట్టారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. మైక్ టైసన్ తాజాగా, ఓ అమెరికాలోని ఓ యూట్యాబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘లైగర్’ సినిమా గురించి యాంకర్లు అడగగా.. మైక్ అర్థం కానట్లు చూశారు. దీంతో ఇంటర్వ్యూ చేసే యాంకర్లు ఆశ్చర్యపోయారు. నవ్వుకున్నారు. వెంటనే సినిమా కాన్సెప్ట్ ట్రైలర్‌ను ప్లే చేశారు. ఆ ట్రైలర్లో తనను తాను చూసుకున్న మైక్ ‘‘ ఓ!! ఆ ట్రైలర్లో ఉన్నది నేనే అనుకుంటా కదా?..
దీని గురించి నాకు తెలీనే తెలీదు’’ అని అన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడిదయాలో వైరల్‌గా మారింది. ఇక, మైక్ టైసన్ షూటింగ్ స్పాటులో ఎలా ఉండేవాడో విజయ్ దేవరకొండ మీడియాకు చెప్పుకొచ్చాడు. తనను ఎప్పుడూ బూతులు తిడుతూ ఉండే వాడని అన్నాడు. ఆ బూతులు ఏంటనేవి తాను బయటకు చెప్పలేనని విజయ్ వాపోయాడు. కానీ, మైక్ టైసన్‌తో తాను పనిచేయటం సంతోషంగా ఉందని చెప్పాడు. మరి, మైక్ టైసన్ ‘లైగర్’ సినిమాలో నటించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : సెప్టెంబర్ లో విడుదలకు సిద్ధమవుతున్న 17 తెలుగు సినిమాలు!