ప్రతీ వారం సినీ ప్రేక్షకులను అలరించేందుకు థియేటర్స్ లోకి కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. వాటిలో స్టార్స్ మొదలుకొని యంగ్ స్టర్స్ వరకూ అందరి సినిమాలు బాక్సాఫీస్ బరిలో పోటీ పడుతుంటాయి. అయితే.. థియేట్రికల్ రిలీజ్ అవుతున్న సినిమాలను లాక్ డౌన్ కి ముందు, లాక్ డౌన్ తర్వాత అన్నట్లుగానే చెప్పుకోవాలి. గతంలో నెలకు నాలుగు నుండి ఆరు సినిమాల వరకు థియేటర్లలో రిలీజ్ అవుతుండేవి. కానీ.. లాక్ డౌన్ తర్వాత సినీ ఇండస్ట్రీలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. పెద్ద సినిమా, చిన్న సినిమా అనే తేడాలేకుండా రిలీజ్ అవుతున్నాయి. అదీగాక ఇదివరకు థియేటర్ లలో విడుదలైన సినిమాలు 50, 100, 200 రోజుల వరకూ ఆడేవి. అదే ఇప్పుడు ఏ సినిమాకైనా వారం, రెండు వారాలే అవకాశం. సినిమా ఎంత వసూల్ చేయాలనుకున్న రెండు వారాలే థియేటర్స్ లభించే పరిస్థితి. నెలకు 4 - 6 సినిమాలు విడుదల కావాల్సింది.. ఇప్పుడు ఏకంగా వారానికి 4 సినిమాల వరకూ రిలీజ్ అవుతున్నాయి. అంటే.. బాక్సాఫీస్ వద్ద ఏ స్టార్ హీరో సినిమాకైనా ఎంతటి తీవ్రపోటీ ఉందనేది ఇట్టే అర్థమవుతుంది. ఇక సెప్టెంబర్ నెలలో ఏకంగా 17 సినిమాలు థియేట్రికల్ రిలీజ్ అవుతున్నాయి. మరి సెప్టెంబర్ లో రిలీజ్ అవుతున్న 17 సినిమాలేంటో చూద్దాం! సెప్టెంబర్ 2: రంగ రంగ వైభవంగా ఫస్ట్ డే ఫస్ట్ షో ఆకాశ వీధుల్లో సెప్టెంబర్ 9: బ్రహ్మాస్త్ర ఒకే ఒక జీవితం నేను మీకు బాగా కావాల్సిన వాడిని కొత్తకొత్తగా సెప్టెంబర్ 15: లాఠీ సెప్టెంబర్ 16: ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి శాకినీ డాకినీ క్రేజీ ఫెలో సెప్టెంబర్ 23: కృష్ణ వ్రిందా విహారి గుర్తుందా శీతాకాలం అల్లూరి దొంగలున్నారు జాగ్రత్త సెప్టెంబర్ 30: రావణాసుర పొన్నియన్ సెల్వన్-1 ఈ విధంగా సెప్టెంబర్ నెలలో రిలీజ్ కాబోతున్న సినిమాల రిలీజ్ లను షెడ్యూల్ చేసుకున్నారు మేకర్స్. ఇందులో బ్రహ్మాస్త్ర, పొన్నియన్ సెల్వన్ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతున్నాయి. ఇక వీటన్నింటిలో బాక్సాఫీస్ వద్ద విజేతలుగా ఎన్ని సినిమాలు నిలుస్తాయో చూడాలి. మరి సెప్టెంబర్ రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలలో మీరు ఏ సినిమా కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్స్ లో తెలియజేయండి.