సాంకేతిక సమస్యల వల్ల కానీ మరేదైనా కారణం చేత .. అప్పుడప్పుడు బ్యాంకుల వినియోగదారుల అకౌంట్లలో భారీ మొత్తంలో డబ్బులు డిపాజిట్ అవుతుంటాయి. అయితే బ్యాంకు అధికారులు తెరుకుని వెంటనే రికవరీకి చర్యలు తీసుకుంటారు. ఈ మధ్యనే ఓ బ్యాంకు కూడా కొందరి ఖాతాల్లో కోట్లల్లో డబ్బులు జమ చేసింది. ఇలా జరిగిన సమయంలో ఖాతాదారులకు తెలిసే లోపే బ్యాంకులు తీసేసుకుంటాయి. “నా అకౌంట్ లో పడితేనా.. వెంటనే తీసుకుని ఉండే వాడిని” అని అలాంటి వార్తలు విన్న సమయంలో కొందరు అంటుంటారు. అచ్చం అలాంటి పనే ఓ ఉద్యోగి చేశాడు. పొరపాటున అతనికి పడాల్సిన జీతం కన్నా 286 రేట్లుఎక్కువ జమ అయింది. బ్యాంకుల కంటే ముందే తేరుకున్న ఆ వ్యక్తి డబ్బులు డ్రా చేసుకుని తెలివిగా తప్పించుకున్నాడు. ఈ ఘటన చిలీలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
చిలీలోని ఓ ఆహార వ్యాపార సంస్థ కన్సోర్సియో ఇండస్ట్రియల్ డి అలిమెంటోస్ సంస్థ ఉంది. అందులో వేలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇక్కడ పనిచేస్తున్న ఓ ఉద్యోగి జీతం ప్రతి నెలా 500,000 పెసోలు అంటే మన కరెన్సీలో దాదాపు రూ. 43,000. కంపెనీ పొరపాటుగా అతని జీతం కంటే 286 రెట్లు అంటే 165,398,851 చిలీ పెసోలను ఈ ఉద్యోగి ఖాతాలో జమ చేసింది. అంటే.. దాదాపు రూ. 1.5 కోట్లు ఉంటుంది. భారీ మొత్తంలో డబ్బు ఖాతాలో చేరడంతోనే సదరు వ్యక్తి మొదట ఆశ్చర్యపోయాడు. కంపెనీలో పనిచేస్తున్న డిప్యూటి మేనేజర్ విషయం తెలుసుకుని ఉద్యోగి దగ్గరకు వెళ్లి విషయం చెప్పగా..మరుసటి రోజు వచ్చి డబ్బు తిరిగి ఇస్తాను అని చెప్పాడట.
అయితే ఇంత డబ్బు మళ్లీ కంపెనీకి ఇవ్వడం వల్ల ప్రయోజనం ఏముంటుంది అనుకున్నాడేమో..ఉద్యోగానికి రాజీనామా చేసి పారిపోయాడు. తన రాజీనామా లెటర్‌ను ఆఫీస్‌కు పంపించి ఉద్యోగి పరారయ్యాడు. డబ్బు తీసుకుని పారిపోయిన ఉద్యోగి జాడ లేకపోవడంతో ఇక్కడి కంపెనీ హెచ్ఆర్ అయోమయంలో పడింది. అయితే కంపెనీ అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. ఇప్పటి వరకు అతడు జాడ లేకపోవడంతో తెలియరాలేదు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Turkey: వ్యక్తి కడుపులో 200లకు పైగా నాణేలు..ఇంకా మేకులు, బ్యాటరీలు కూడా..!