ఈ మధ్య కాలంలో బాయ్ బెస్టీల గోల ఎక్కువయిపోయింది. అమ్మాయిలు ఓ అబ్బాయితో ఫ్రెండ్‌షిప్ చేస్తారు. అతడితో చాలా క్లోజ్‌గా ఉంటారు. ఓ లవ్‌లో ఏదైతే చేస్తారో అతడితో అన్నీ ఉంటాయి. కానీ, ఆ అబ్బాయి ఐ లవ్ యూ చెబితే మాత్రం టర్మ్స్ మారిపోతాయి. ‘‘నిన్ను ఎప్పుడూ ఆ ఉద్ధేశ్యంతో చూడలేదు. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్‌వి మాత్రమే. యు ఆర్ మై బెస్టీ’’ అని అంటుంది. ఆ అబ్బాయికి ఆమె చెప్పేది అర్థం అయినా.. భరించటం కష్టం అవుతుంది. ఇన్నాళ్లు నువ్వు నన్ను బెస్ట్ ఫ్రెండ్‌గానే చూశావా అనుకుంటూ కృంగిపోతాడు. అయితే, ఇక్కడ అసలు విషయం ఏంటంటే.. చాలా మంది అమ్మాయిలు బెస్టీ అని చెప్పుకునే వ్యక్తితో ప్రేమలో పడతారు.
కానీ, అతడు ప్రేమికుడా.. ఫ్రెండా అన్నదాంట్లో వారికి క్లారిటీ ఉండదు. ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి ప్రపోజ్ చేస్తాడో.. అప్పుడు అసలు గొడవ మొదలవుతుంది. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్‌వి మాత్రమే అనేస్తారు. సింగపూర్‌కు చెందిన టాన్ అనే యువతి కూడా కషిగాన్‌తో అదే విధంగా అంది. అయితే, కషిగాన్ తట్టుకోలేకపోయాడు. ఇన్ని రోజులు నాతో తిరిగి.. నాలో ఆశలు రేపి ఫ్రెండ్ అని చెప్పి తప్పించుకుంటావా? అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. 2016లో వీరిద్దరి మధ్యా స్నేహం మొదలైంది. 2020లో అతడు ప్రపోజ్ చేశాడు. ఇందుకు ఆమె ఒప్పకోలేదు. ‘‘నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్‌వి మాత్రమే’’ అని అంది. దీంతో కషిగాన్ మనసు ముక్కలైంది.
ఆమె మీద దావా వేయటానికి సిద్ధం అయ్యాడు. అంతకంటే ముందు ఆమెకు ఓ ప్రపోజల్ పెట్టాడు. తనతో పాటు కౌన్సిలింగ్‌కు రమ్మన్నాడు. కౌన్సిలింగ్ తర్వాత కూడా ఆమెలో మార్పురాలేదు. అతడికి దూరం అయింది. తన మనసులో ఆశలు రేకిత్తించి, వ్యక్తిగతంగా.. ఉద్యోగరీత్యా ఇబ్బందులకు గురిచేసిన కారణంగా ఆమెపై 3 మిలియన్ డాలర్లకు దావా వేశాడు. ఇది మన ఇండియన్ కరెన్సీలో 24 కోట్ల రూపాయలు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో నడుస్తోంది. విచారణ ఫిబ్రవరి 9న జరగనుంది. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.