ప్రతి ఒక్కరు జీవించాలంటే గాలి, నీరు, ఆహారం తప్పనిసరిగా ఉండాలి. అలానే నిత్యం ఏదో ఒక ఆహార పదార్ధాలను మూడు పూటల తింటూ జీవితాన్ని గడుపుతాము. అయితే ఓ వ్యక్తి మాత్రం కూల్ డ్రింక్స్ ను ఆహారంగా 17 ఏళ్ల నుంచి తాగుతున్నాడు. ఈ విషయంపై అతడు చెప్పిన మాటలు విని అందరు షాకయ్యారు.
ప్రతి ఒక్కరు జీవించాలంటే గాలి, నీరు, ఆహారం తప్పనిసరిగా ఉండాలి. అలానే నిత్యం ఏదో ఒక ఆహార పదార్ధాలను మూడు పూటల తింటూ జీవితాన్ని గడుపుతాము. అన్నం, రొట్టేలు, మాంస పదార్థాలు వంటి ఇతర ఆహారలను ఆరగిస్తుంటాము. ఒకవేళ రెండు రోజుల పాటు ఆహారం తీసుకోకుంటే మనిషి అనారోగ్యానికి గురవుతాడు. అయితే కొందరు మాత్రం ఎటువంటి ఆహారం తీసుకోకుండా కేవలం చిప్స్ వంటి వాటిని మాత్రమే తింటారు. ఇలాంటి వారి గురించి విన్న, చూసిన ఆశ్చర్యం కలుగుతుంది. తాజాగా ఓ వ్యక్తి కూడా 17 ఏళ్లుగా కూల్ డ్రింక్స్ నే ఆహారంగా తీసుకుంటూ జీవిస్తున్నాడు. మరి.. ఆ వ్యక్తి వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇరాన్ కు చెందిన ఘోలం రేజా అనే 56 ఏళ్ల వ్యక్తి తినే ఆహారం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈయన అందరి మాదిరిగా ఘన ఆహార పదార్థాలు తీసుకోవడం మానేశాడు. తోటి వారు తింటున్న ఆహారం చూస్తే ఈయనకు వికారం కలుగుతుందట. అందుకే గత 17 ఏళ్లుగా శీతల పానీయాలు తాగి జీవనం సాగిస్తున్నాడు. ఇదే సమయంలో వారానికి ఒక రోజు కొద్దిగా నీరు, టీ కూడా తీసుకుంటాడు. అతడు ఇలా ప్రవర్తించడానికి కారణం 2006లో జరిగిన ఓ ఘటన.
2006లో ఒక రోజు రాత్రి నిద్రలో నుంచి ఘోలంరేజా ఉలిక్కిపడి లేచాడు. ఆ తరువాత ఆయన గొంతులో వెంట్రుకల కట్ట ఇరుక్కు పోయినట్లు భావన కలిగింది. ఆ కట్టను బయటకు తీద్దామని ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదు. దీంతో చాలా మంది వైద్యులను సంప్రదించాడు. ఎవర్ని కలసిన.. గొంతులో ఏమి లేదని తెలిపారు. అయినా ఘోలం రేజా ఈ భావనను మరచిపోలేదు. చివరకు అతడు ఆహారం తినడం మానేశాడు. దీంతో ఘోలంరేజా కాస్త ఉపశయమనం లభించింది. ఇక అప్పటి నుంచి శీతల పానీయాలు తాగడం మొదలు పెట్టిన ఆయన రోజుకు మూడు పెద్ద బాటిళ్లు ఖాళీ చేస్తున్నాడు.
ఇలా చేయడం వల్ల ఇప్పటి వరకు 32 కిలోల బరువు తగ్గానని ఆయన స్వయంగా చెప్పారు. ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయనే సందేహంతో తరచూ ఎండో స్కోపీ సహా ఇతర పరీక్షలు చేయించే వాడు. ఇలా ఆయన చేయించుకునే అన్నీ రకాల పరీక్షల్లో ఆరోగ్యం సాధారణంగానే ఉందంట. అయితే అతడి చూసి అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఈ వ్యక్తిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.