ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా రికార్డులకెక్కిన లూసిల్ రాండన్(118) అనే బామ్మ తుదిశ్వాస విడిచారు. ఫ్రాన్స్ కు చెందిన ఈవిడ టౌలోన్ సిటీలోని నర్సింగ్ హోమ్ లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ బామ్మ అసలు పేరు లూసిల్ రాండన్ అయినా కూడా.. సిస్టర్ ఆండ్రోగా గుర్తింపు సొంతం చేసుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా గిన్నిస్ బుక్ రికార్డు ఈవిడ పేరిటే ఉండేది. జపాన్ కు చెందిన కానె టనక 119 ఏళ్ల వయసులో మృతి చెందిన తర్వాత లూసిల్ రాండన్ అత్యంత వృద్ధురాలిగా నిలిచారు. ఇప్పుడు లూసిల్ మరణంతో ఆ రికార్డు అమెరికాకు చెందిన 115 ఏళ్ల మారియా పేరు మీదకు మారనుంది.
2022 ఏప్రిల్ నెలలో లూసిల్ రాండన్ ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా గుర్తింపు సాధించారు. ఆ సందర్భాన్ని ఆవిడ అత్యంత దురదృష్టకరమైనదిగా అభివర్ణించారంట. ఆ దయగల ప్రభువు అవకాశం కల్పించి ఉంటే అప్పటికే స్వర్గంలో ఉండే దానిని అంటూ స్పందించారట. కొవిడ్ వ్యాపిస్తున్న తొలినాళ్లలోనే లూసిల్ రాండన్ దాని బారిన పడ్డారు. ఆమెకు ఎలాంటి లక్షణాలు కూడా లేకపోవడం చూసి వైద్యులే నిర్ఘాంతపోయారు. ఆవిడ 118 సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ పుట్టినరోజు శుభాకాంక్షలను స్వయంగా రాసి పంపారట. పోప్ ఫ్రానిస్స్ కూడా 2021లో లూసిల్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ పంపారట.
లూసిల్ రాండన్ క్రైస్తవ సన్యాసినిగా ఎంతో మందికి సేవ చేశారు. అనాథ పిల్లలను చూస్తే ఆవిడ మనసు కరిగిపోయేదట. అనాథలు, వృద్ధులకు లూసిల్ రాండన్ ఎన్నో సేవలు చేశారు. ఆమె జీవితంలో రెండు ప్రపంచ యుద్ధాలను చూశారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత పూర్తిగా సేవ చేయడమే తన లక్ష్యంగా పెట్టుకున్నారు. సన్యాసినిగా మారిన తర్వాత లూసిల్ విచీలోని ఆస్పత్రిలో 31 ఏళ్లు సేవలందించారు. ఆవిడకు 75 సంవత్సరాలు వచ్చే వరకు ఏదొక పని చేస్తూనే ఉన్నారు. తర్వాత 2009 నుంచి ఆవిడ దృష్టి కాస్త మందగించడంతో టౌలోన్ నర్సింగ్ హోమ్ కే పరిమితమయ్యారు. 2010 నుంచి వీల్ చెయిర్ కే పరిమితమైన లూసిల రాండన్.. నిద్రలోనే కన్నుమూశారు.
లూసిల్ రాండన్ కుటుంబ నేపథ్యం విషయానికి వస్తే.. 1904 ఫిబ్రవరి 11న సౌత్ ఫ్రాన్స్ కు చెందిన అలెస్ సిటీలో జన్మించారు. లూసిల్ కు ఒక కవల సోదరి లైడీ అని ఉండేది. కాకపోతే పుట్టిన ఏడాదికే కన్నుమూసింది. ఆమెకు ముగ్గురు సోదరులు. 26 ఏళ్ల వయసులోనే బాప్టిజం తీసుకుని నన్ గా మారిపోయారు. ఇప్పుడు గట్టిగా 60 ఏళ్లు బతికితే చాలు అనుకునే రోజుల్లో లూసిల్ రాండన్ 118 ఏళ్లు ఎలా బతికారంటూ ప్రపంచవ్యాప్తంగా చాలామందికి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అసలు ఆవిడ ఏం తినేవారు? ఎలాంటి వ్యాయామం చేసేవారు? అంతకాలం ఆరోగ్యంగా ఎలా ఉండగలిగారు? అంటూ ప్రశ్నిస్తున్నారు.
Rest in Peace Lucile Randon, manusia tertua di dunia 🥀
Semasa hidupnya, Randon udah pernah ngerasain berbagai kejadian seperti perang dunia sejak 1904, lho 🥺
Tonton informasi lainnya di #NarasiPagi dengan klik https://t.co/zmlF8gK4Zj ya~
| Narasi Pagi pic.twitter.com/Ab12k9QkHG
— Narasi Newsroom (@NarasiNewsroom) January 20, 2023
అయితే లూసిల్ రాండన్ ప్రత్యేకంగా ఏమీ జీవించేవారు కాదట. అందరిలాగానే ఆహారం తీసుకునేవారు. ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇలా సాధారణమైన ఆహారపు అలవాట్లనే పాటించేవారట. ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా చాక్లెట్లు, స్వీట్స్ తినడానికి ఏమాత్రం సంకోచించేవారు కాదట. రోజూ ఉదయాన్నే ఒక చాక్లెట్ మాత్రం తప్పక తీసుకునే వారట. ఆవిడ జీవితంలో వైన్ తాగుతూనే ఉండేవారట. అయితే లూసిల్ రాండన్ అందరికీ ఒక విషయాన్ని చెప్పేవారట. ‘మీరు పనిచేస్తూ ఉండండి ఆరోగ్యంగా ఉంటారు. నేను నా 108వ ఏట వరకు పని చేశాను’ అంటూ లూసిల్ రాండన్ బామ్మ అందరికీ సూచించేవారు.
Lucile Randon, a.k.a. Sister André, passed away at a nursing home in France. At 118, the retired Catholic nun was believed to be the oldest person on Earth before her death. pic.twitter.com/lWGPvMlJ2H
— NowThis (@nowthisnews) January 18, 2023