అమెరికా అధ్యక్షులు జో బైడెన్ 2020 యునైటెడ్ స్టేట్స్ అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌ను అమెరికా సంయుక్త రాష్ట్రాలు డెమొక్రాటిక్ పార్టీ తరుపు నుండి విజయం సాధించి అమెరికా 46 వ అద్యక్ష్యుడు అయ్యడు.
ప్రమాదాలు అనేవి ఎప్పుడు ఎటు నుంచి వస్తాయో ఊహించడం కష్టం.. చిన్న చిన్న పొరపాట్లు పెను ప్రమాదాలకు దారి తీస్తుంటాయి. ప్రముఖ నేతలు, సెలబ్రెటీలు కొన్నిసార్లు ప్రమాదాలకు గురి అవుతుంటారు.. అదృష్టం బాగుండి ప్రమాదాల నుంచి తృటిలో తప్పించుకోవడంతో అటు వారి కుటుంబ సభ్యులు, ఇటు అభిమానులు ఊపిరి పీల్చుకుంటారు. తాజాగా అమెరికా అధ్యక్షులు జో బైడెన్ కి తృటిలో ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే..
2020 లో అమెరికాలో ఉత్కంఠంగా ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్, జో బైడెన్ కి మద్య హూరా హూరీ పోటీ జరిగింది. డోనాల్డ్ ట్రంప్ పై అమెరికా సంయుక్త రాష్ట్రాలు డెమోక్రాటిక్ పార్టీ తరుపు నుంచి విజయం సాధించి అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడన్ ఎన్నికయ్యారు. ప్రస్తుతం బైడెన్ యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. తాజాగా ఆయన ఎయిర్ ఫోర్స్ వన్ విమానం ఎకుతున్న సమయంలో అనుకోకుండా మెట్లపై జారి పడబోయారు. పోలాండ్, ఉక్రెయిన్ పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణం అయ్యారు… ఆ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విమానం మెట్లను మెల్లగా ఎక్కినై బైడెన్ అనుకోకుండా జారిపోయారు… వెంటనే చేతులతో నిలదొక్కుకుని ముందుకు సాగారు. ఈ హాఠాత్ పరిణామంతో భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు. ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
అమెరికా అధ్యక్షులు జో బైడెన్ కి ఇలా మెట్లపై స్లిప్ కావడం ఇదేమీ కొత్త కాదు. 2021 లో జార్జియా నుంచి బయలుదేరిన ఆయ విమానం మెట్లు ఎక్కుతుండగా అకస్మాత్తుగా పడబోయారు.. వెంటనే భద్రతా సిబ్బంది ఆయనను పట్టుకున్నారు. ఆ తర్వాత 2022 లో ఆండ్రూస్ ఎయిర్ ఫోర్స్ వన్ మెట్లు ఎక్కుతుండగా బ్యాలెన్స్ తప్పి పడిపోయారు. అలాగే అమెరికా సమ్మిట్ కోసం లాస్ ఎంజెల్స్ కి వెళ్తున్న సమయంలో జో బైడెన్ మెట్లు ఎక్కుతూ తడబడ్డారు. అయితే ఈ ప్రమాదాల్లో ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
Biden, once again, falls up the stairs on AF1…after the White House Doctor stated that, “Joe Biden remains a healthy, vigorous, 80-year-old male…who’s fit…” pic.twitter.com/IaVq64QF4k
— Liz Churchill (@liz_churchill8) February 22, 2023