కొంతమంది వింతగా కనిపించాలనే ఉద్ధేశ్యంతో తమ శరీరాన్ని ఇష్టం వచ్చినట్లు కోయించుకున్నారు. తాజా ఘటనలో ఓ యువతి ప్రియుడ్ని ముద్ద పెట్టుకోవటంలో నాలుక అడ్డుగా ఉందని భావించింది.
‘‘జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి’’ అన్న చెందాన.. ఒక్కోరు ఒక్కో విధంగా ఆలోచిస్తూ ఉంటారు. వింతగా కనిపించాలనే ఆలోచనతో శరీరాన్ని సర్జరీతో పాడు చేసుకున్న వారు ప్రపంచ వ్యాప్తంగా చాలా మందే ఉన్నారు. వీరంతా నిజానికి ఏదో ఒక మానసిక పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వీరికి భిన్నంగా మరికొంతమంది ఉంటారు. వారు తీసుకునే నిర్ణయాలు అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. తాజాగా, ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రియుడిని ముద్దు పెట్టుకోవటంలో నాలుక అడ్డం వస్తోందని భావించి దాన్ని కొంచెం కట్ చేయించుకుంది. వాస్తవానికి దీని వెనుక ఓ పెద్ద కారణమే ఉంది.
వివరాల్లోకి వెళితే.. క్సెహ్లి జీ అనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌కు ‘‘లింగువల్ ఫ్రెనులమ్’’ అనే ఓ కండీషన్ ఉంది. ఇదేంటంటే.. ఆమె నాలుక కింది భాగంలో కొంత కండ అడ్డుగా ఉంది. దీంతో తాను ఎంతగానో ప్రేమించే ప్రియుడ్ని ముద్దు పెట్టుకోవటంలో ఇబ్బంది ఎదురవసాగింది. ఈ నేపథ్యంలోనే ఇద్దరి ప్రేమ జీవితానికి ఆటంకాలు ఎదురవసాగాయి. ఇలా తన ప్రేమ జీవితానికి అడ్డుగా ఉన్న నాలుకలోని ఆ ఎక్స్‌ట్రా భాగాన్ని ఆమె తీయించుకోవాలని భావించింది. ఇందుకోసం ఆపరేషన్‌కు సిద్ధమైంది. ఆపరేషన్ ద్వారా తన నాలుకలోని ఆ భాగాన్ని తీయించుకుంది.
దీనిపై ఆమె మాట్లాడుతూ.. ‘‘ లింగువల్ ఫ్రెనులమ్ నన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టింది. నవ్వటానికి, ముద్దు పెట్టుకోవటానికి కూడా ఇబ్బంది ఎదురైంది. అందుకే నేను ఆపరేషన్ చేయించుకున్నాను. నా జీవితంలో నేను తీసుకున్న మంచి నిర్ణయం అంటే ఆపరేషన్ చేయించుకోవటం. ఆపరేషన్ తర్వాత నా జీవితం నూరు శాతం బాగైంది’’ అని చెప్పుకొచ్చింది. మరి, ప్రియుడ్ని ముద్దు పెట్టుకోవటానికి ఇబ్బందిగా ఉందంటూ నాలుకను కట్ చేయించుకున్న క్సెహ్లి జీ ఉదంతంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.