ఈ మద్య ప్రపంచ వ్యాప్తంగా డేటింగ్ కల్చర్ (సహజీవనం) ఎక్కువైంది. సహజీవనం అంటే పెళ్లి కాకుండానే ఇష్టపూర్వకంగా యువతీ యువకులు కలిసి జీవించడం. స్నేహితులుగా ఉన్నవారు.. సహజీవనం చేస్తున్నారు.. ఆ సమయంలో ఇరువురి అంగీకారంతో శారక సంబంధాలు కూడా కొనసాగిస్తుంటారు. తర్వాత కలిసి ఉండాలనుకుంటే వివాహం చేసుకోవడం.. లేదంటే విడిపోవడం జరుగుతుంది. ఈ కల్చర్ ఎక్కువగా పాశ్చాత్య దేశాల్లో కనిపిస్తుంది. పెళ్లి కాకుండా శృంగారంలో పాల్గొంటే అది కాబోయే భార్య లేదా భర్తను ముమ్మాటికి మోసం చేసినట్లే అవుతుంది.. ఇలాంటి దారుణాలకు పాల్పపడకుండా తమ దేశ విలువలు పెంచేందుకు ఇండోనేషియా ఓ సంచలన చట్టాన్ని తీసుకు రాబోతున్నట్టు ప్రకటించింది. వివరాల్లోకి వెళితే..
వివాహానికి ముందు శృంగారం తో పాటు సహజీవనం లాంటివి చేయడం పూర్తిగా నిషేధించేందుకు ఇండేనేషియా సిద్దమయ్యింది. అలాగే ప్రభుత్వ విలువలు.. సిద్దాంతాలను కించపరిచే వ్యాఖ్యలపై సైతం ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలు ఎవరైనా అతిక్రమిస్తే వారు శిక్షార్హులవుతారని తెలిపింది. ఈ క్రమంలో నూతన చట్టం తెచ్చేందుకు సిద్దమైనట్టు ఆ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. దీనికి సంబంధించి క్రిమినల్ కోడ్ ముసాయిదా పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఇండొనేషియాలో అమలు జరపబోయే కొత్త క్రిమినల్ కోడ్ ప్రకారం.. ఎవరైనా సహజీవనం అంటూ హద్దులు మీరి పెళ్లికి ముందుగానే శృంగారంలో పాల్గొంటే వారికి ఒక సంవత్సరం జైలు శిక్ష విధించబడుతుంది.
తమ భర్త లేదా భార్య కాని వారితో శృంగారం చేస్తే దాన్ని వ్యభిచార నేరం కింద పరిగణించబడుతుంది.. వారికి ఏడాది జైలు శిక్షతో పాటు జరిమానా విధించబడుతందని ఆర్టికల్ 413 లో పేర్కొన్నారు. అయితే ఈ తరహా వ్యభిచారం జరుగుతుందని పిల్లల నుంచి ఫిర్యాదులు వస్తేనే కేసు నమోదు చేయడం జరుగుతుందని కొత్త చట్టంలో పేర్కొనబడిఉంది. ఈ ముసాయిదా బిల్లుకు డిసెంబర్ 15 ఆమోదం తెలపబోతున్నట్లుగా వర్తలు వస్తున్నాయి.
వాస్తవానికి మూడేళ్ల క్రితమే ఈ బిల్లు తీసుకు రావడానికి ప్రయత్నించినప్పటికీ దేశ వ్యాప్తంగా వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది.. తాజాగా ఈ కొత్త బిల్లును మళ్లీ తీసుకు వచ్చింది. ఇండోనేషియా విలువలు కాపాడేందుకే ఈ కొత్త చట్టాన్ని అమలు చేసేందుకు సిద్దమవుతున్నట్టుగా దేశ డిప్యూటీ న్యాయమంత్రి తెలిపారు. ఈ చట్టం ఇండోనేషియా పౌరులకు మాత్రమే కాదు.. విదేశీయులకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయని న్యాయమంత్రి ఓమర్ షరీఫ్ హియరియేజ్ వివరించారు.