Gotabaya Rajapaksa: శ్రీలంక దేశంలో ఆర్థిక సంక్షోభం ముదురుతోంది. అధ్యక్షుడు మారినా దేశ ఆర్థిక పరిస్థితుల్లో పెద్దగా మార్పు రాలేదు. దీంతో దేశ ప్రజలు తిరుగుబాటు మొదలుపెట్టారు. దేశ ఆర్థిక పరిస్థితుల్ని చక్కదిద్దలేని గోటబయ రాజపక్స రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రాజపక్స రాజీనామాను డిమాండ్ చేస్తూ దేశ రాజధాని కోలంబోను ఆక్రమించారు. అక్కడి అధ్యక్ష భవనాన్ని చుట్టుముట్టారు. కొంతమంది ఆందోళనకారులు అధ్యక్ష భవనంలోకి చొచ్చుకెళ్లారు. అధ్యక్ష భవనంలో నానా హంగామా చేశారు. కొందరు యువకులు రాజపక్స బెడ్‌పై చిందులు వేశారు.
బెడ్‌పై డబ్ల్యూడబ్ల్యూఈ తరహా ఫైట్లను సైతం చేశారు. ఈ నేపథ్యంలోనే అధ్యక్ష భవనంలో భారీగా నగదు కట్టలు బయటపడ్డట్టు వార్తలు వస్తున్నాయి. రాజపక్స ఇంట్లోని అల్మారాలో కోట్ల రూపాయల నగదు దొరికినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఓ యువకుడు నేలపై కూర్చుని నోట్లను లెక్కపెడుతూ ఉన్నాడు.
అతడి పక్కనే ఉన్న మరికొంతమంది చేతిలో నోట్ల కట్టలు ఉన్నాయి. వారంతా వాటిని ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ ఉన్నారు. ఆ మొత్తం నగదు విలువ 17.8 బిలియన్ రూపాయలుగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, నిరసనకారులు ఇంటిపై దండెత్తడంతో రాజపక్స అక్కడినుంచి పరారయ్యారు. ఇంటికి దూరంగా ఎక్కడో రహస్య స్థావరంలో తలదాచుకుంటున్నట్లు సమాచారం. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Protesters who seized the residence of the head of Sri Lanka found a huge amount of money there.
Millions of rupees were in President Gotabaya Rajapaksa’s closet, local media reported. Eyewitnesses published a video online, in which they allegedly counted 17.8 million. pic.twitter.com/fwxCZiM8FJ
— Jim yakus (@SJIMYAKUS) July 10, 2022
ఇవి కూడా చదవండి : Sri Lanka: రణరంగాన్ని తలపిస్తున్న శ్రీలంక.. ఇంటి నుంచి పరారైన అధ్యక్షుడు గొటబాయ రాజపక్స!