శ్రీలంక నూతన అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే ఎన్నికయ్యారు. గొటబాయ రాజపక్స స్ధానంలో కొత్త అధ్యక్షుడిగా రణిల్ ను శ్రీలంక పార్లమెంట్ ఎన్నుకుంది. కాగా, లంక 8వ అధ్యక్షుడిగా విక్రమ సింఘేను ఎంపీలు ఎన్నుకున్నారు. ఈరోజు జరిగిన ఓటింగ్‌లో విక్రమ సింఘేకు ఎక్కువ ఓట్లు పడ్డాయి. దీంతో ఆయన కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 221 ఓట్లకు గాను విక్రమ సింఘేకు మొత్తం 134 ఓట్లు వచ్చాయి. అయన ప్రధాన ప్రత్యర్థి దులాస్ అలహప్పెరుమకు 82 ఓట్లు లభించగా.. లెఫ్టిస్ట్ […]
Gotabaya Rajapaksa: శ్రీలంక దేశంలో ఆర్థిక సంక్షోభం ముదురుతోంది. అధ్యక్షుడు మారినా దేశ ఆర్థిక పరిస్థితుల్లో పెద్దగా మార్పు రాలేదు. దీంతో దేశ ప్రజలు తిరుగుబాటు మొదలుపెట్టారు. దేశ ఆర్థిక పరిస్థితుల్ని చక్కదిద్దలేని గోటబయ రాజపక్స రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రాజపక్స రాజీనామాను డిమాండ్ చేస్తూ దేశ రాజధాని కోలంబోను ఆక్రమించారు. అక్కడి అధ్యక్ష భవనాన్ని చుట్టుముట్టారు. కొంతమంది ఆందోళనకారులు అధ్యక్ష భవనంలోకి చొచ్చుకెళ్లారు. అధ్యక్ష భవనంలో నానా హంగామా చేశారు. కొందరు యువకులు […]
సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో ప్రజాగ్రహం నానాటికీ పెరుగుతోంది. ఇప్పటికే మహీంద రాజపక్స ప్రధాని పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి ఆదేశంలో ఆర్ధిక సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది. ఇంకొకవైపు రాజకీయ అస్థిరతా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భారీ సంఖ్యలో ఆందోళన కారులు ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అధికారిక నివాసాన్ని చుట్టుముట్టారు. దీంతో వారి నుంచి తప్పించుకునేందుకు రాజపక్స తన ఇంటి నుంచి పరారయ్యారు. ఈ సమాచారాన్ని ఆ దేశ […]