సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో ప్రజాగ్రహం నానాటికీ పెరుగుతోంది. ఇప్పటికే మహీంద రాజపక్స ప్రధాని పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి ఆదేశంలో ఆర్ధిక సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది. ఇంకొకవైపు రాజకీయ అస్థిరతా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భారీ సంఖ్యలో ఆందోళన కారులు ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అధికారిక నివాసాన్ని చుట్టుముట్టారు. దీంతో వారి నుంచి తప్పించుకునేందుకు రాజపక్స తన ఇంటి నుంచి పరారయ్యారు. ఈ సమాచారాన్ని ఆ దేశ రక్షణ వర్గాలు మీడియాకు వెల్లడించాయి. గత కొన్ని నెలలుగా ఆహారం, ఇంధన సమస్యతో శ్రీలంక అట్టుడుకుతోంది. ద్రవ్యోల్బణం అంతకంతకు పెరుగుతోంది. దీంతో దేశ వ్యాప్తంగా ప్రజలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో అధికారులు కర్ఫ్యూ విధించారు. పోలీసులు కర్ఫ్యూ ఆదేశాలను ఎత్తివేసిన నేపథ్యంలో ఆందోళన కారులు మరొసారి వీధుల్లోకి వచ్చారు. ఈ క్రమంలో అధ్యక్షుడి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ.. కొలంబో వీధుల్లో శనివారం నిరసనకారులు భారీ ర్యాలీకి దిగారు. వారంతా శ్రీలంక జెండ, హెల్మెంట్లు ధరించి అధ్యక్షుడి అధికారిక నివాసాన్ని చుట్టుముట్టారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. బారికేట్లను తోసుకుంటూ గొటబాయ నివాసంలోకి దూసుకెళ్లారని ఆ దేశ మీడియా వర్గాలు వెల్లడించాయి. దీంతో, ఆయన తన నివాసం నుంచి వెళ్లిపోయారు. గొటబాయ రాజపక్స సురక్షితంగా వేరే ప్రాంతంలో ఉన్నారని ఆ దేశ రక్షణశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి చెప్పారు. శ్రీలంకను ఆర్థిక కష్టాల నుంచి బయటపడేసేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి సాయం కోసం చర్చలు జరుగుతున్నాయి. మరి.. దేశ అధ్యక్షుడి భవనానే ప్రజలు చుట్టుముట్టంపై మీ అభిప్రాయాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. Most of u probably don't know what's happening in my country, Sri Lanka. 74 years of corrupt rule lead us to this economic & political crisis. But now ENOUGH IS ENOUGH. People of Sri Lanka has came together as a country-#අරගලයටජයpic.twitter.com/fD1kWGaLHV — καωyα• SG3 when?? (@istanSelenerr) July 9, 2022 ఇదీ చదవండి: Economic Crisis: పాకిస్తాన్ లో ఆర్థిక సంక్షోభం.. ఇకపై ఫంక్షన్లలో ఒకటే వంట! ఇదీ చదవండి: పోలీసులు పట్టుకుంటారన్న భయంతో నాలుగో అంతస్తు నుంచి దూకిన దొంగ