సాధారణంగా వీకెండ్స్ లో ఫ్యామిలీ మెంబర్స్ హూటల్స్ కి వెళ్లడం తమకు ఇష్టమైన వంటకాలు రూచి చూడటం కామన్ అయ్యింది. గత రెండేళ్లుగా కరోనా నేపథ్యంలో ఈ సందడి కాస్త తగ్గినా.. ప్రస్తుతం కేసుల సంఖ్య తగ్గడంతో మళ్లీ హూటల్స్ కి చాలా మంది క్యూ కడుతున్నారు. అప్పుడప్పుడు కొంత మంది హూటల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తినే ఆహార పదార్థాల్లో బొద్దింకలు, బల్లులు ఇతర క్రిమి కీటకాలు రావడం అది కాస్త పెద్ద గొడవ కావడం చూస్తూనే ఉన్నాం.
తాజాగా ఓ మహిళ.. రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేసిన బర్గర్ లో మనిషి వేలు బయటపడింది. దీంతో ఆ మహిళ కొద్ది సేపు షాక్ కి గురైంది. ఈ విషయంపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని.. బాధ్యులైన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని వినియోదారుల సహాయ మంత్రి ప్రకటించారు. ఈ సంఘటన దక్షిణ అమెరికాలోని బొలీవియాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బొలీవియాలోని శాంటా క్రజ్‌లోని రెస్టారెంట్ లో ఒక మహిళ బర్గర్ ఆర్డర్ ఇచ్చింది. ఆ బర్గర్ ను తినడానికి ఆ మహిళ ప్రయత్నిస్తున్న సమయంలో అందులో మనిషి వేలి బయపడింది.
అంతే ఆ మహిళ గుండె గుభేల్ అంది.. రెస్టారెంట్ నిర్లక్ష్యానికి గుర్తు అంటూ.. వేలు ఉన్న బర్గర్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది సదరు మహిళ. ఈ విషయంపై వినియోగదారుల రక్షణ శాఖ సహాయ మంత్రి జార్జ్ సిల్వా స్పందిస్తూ.. ఈ ఘటనకు భాద్యులైన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. పని చేస్తున్న కార్మికుడు తన వేలుని కోల్పోయాడని.. కార్మికుడి వేలులో కొంత భాగం మహిళకు ఇచ్చిన బర్గర్ లో ఉందని దర్యాప్తులో తేలిందని చెప్పారు. బాధ్యులైన వారికి చట్టం ప్రకారం కనీసం 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుందని సిల్వా అన్నారు.