మనిషి సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినా.. ఎన్ని అద్భుత ప్రయోగాలు చేసినా.. ప్రకృతి ముందు తలవంచాల్సిందే. అంతరిక్షంలోకి దూసుకుపోతున్న మనం.. ప్రకృతి విలయాలను ముందుగా గుర్తించినప్పటికీ.. వాటికి అడ్డుకట్ట వేయలేకపోతున్నాం. భారీ వరదలు, తుపానులు మనవజీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. తాజాగా బ్రెజిల్ మరోసారి భారీ వర్షాల కారణంగా చిగురుటాకులా
వణికింది.
భారీ వర్షాలు, వరదలతో బ్రెజిల్ అతలాకుతలమవుతోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల ధాటికి రియో డి జెనీరో రాష్ట్రంలో కొండచరియలు విరిగిపడ్డాయి. రియో నగరానికి ఉత్తరాన 68 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుందరమైన హిల్ టౌన్ పెట్రోపోలిస్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 18 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు. శిథిలాల కింద మరింత మంది చిక్కుకొని ఉండొచ్చని భావిస్తున్నారు. మరణాల సంఖ్య పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. కొండచరియలు విరిగిపడిన ప్రదేశంలో అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. మూడు గంటల్లోనే 26 సెంటీమీటర్ల వర్షం కురిసిందని అధికారులు వెల్లడించారు. ఈ భారీ వర్షల కారణంగా అనేక ఇళ్లు, వాహనాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ధ్వంసమైన ఇళ్లు మరియు కార్లు వరదనీటిలో కొట్టుకుపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో స్థానిక ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.
#Brazil – #RioDeJaneiro
Death toll has risesen to 23 after heavy rainfall causes major flooding in suburb
Petrópolis.pic.twitter.com/er51ce1ssT— Michael Barthel (@RealMiBaWi) February 16, 2022
బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారో ప్రస్తుతం రష్యాలో పర్యటిస్తున్నారు. బాధితులకు సత్వరమే సహాయక చర్యలు చేపట్టాలని మంత్రులను ఆదేశించినట్లు బొల్సొనారో ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
🔴#URGENTE| IMPACTANTES IMAGENES !!
torrenciales lluvias en la ciudad de #Petrópolis, en el Estado de Río de Janeiro. 🇧🇷🌪️🌲🔥 pic.twitter.com/KvvyYLhmGL
— 🚨ALERTA ECUADOR🚨 (@DiarioQuito) February 16, 2022