సామాన్యులకు విమాన ప్రయాణం అంటే అదో కల.. ఇక సెలబ్రిటీలకు అయితే.. సర్వసాధారణం. సినిమా షూటింగ్స్, ఈవెంట్స్, వ్యాపార కార్యక్రమాలు, క్రీడలు వంటి వాటిల్లో పాల్గొనడం కోసం సెలబ్రిటీలు తరచుగా విమానయానం చేస్తారు. ఇక సామాన్యులు, మధ్యతరగతి కుటుంబాల వారికి విమానాయనం అనేది ఓ కల. జీవితంలో ఒక్కసారైనా సరై.. విమానయానం చేయాలని కోరుకుంటారు. ఇక సాధారణంగా రోడ్డు ప్రమాదాలు జరిగినట్లే.. విమానాలు క్రాష్ ల్యాండింగ్ అవ్వడం, కుప్పకూలడం వంటి సంఘటనలు చూస్తూ ఉంటాం. కానీ తాజాగా ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. బలమైన గాలుల కారణంగా విమానం కుదుపులకు గురయ్యి.. దానిలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఎగిరిపడ్డారు. ఈ భయానక సంఘటన ఎక్కడ చోటు చేసుకుంది అంటే..
ఈ సంఘటన హవాయి ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో చోటు చేసుకుంది. ఆదివారం.. ఫ్లైట్ విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వడానికి ముందు.. బలమైన గాలులు కుదిపేయడంతో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఫీనిక్స్ నుంచి హొనొలుకు బయలుదేరిన ఈ విమానం.. హవాయి ఎయిర్‌లైన్స్‌కు చెందినది. ఇక దీనిలో 10 మంది క్రూ సిబ్బంది సహా.. సుమారు 300 మంది ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో ఫ్లైట్ ల్యాండ్ అయ్యే సమయంలో బలమైన ఈదురు గాలులు వీచడంతో.. సీటు బెల్టు సరిగ్గా ధరించని వారు.. ఒక్కసారిగా పైకి ఎగిరారు. ఈ క్రమంలో విమానం పైకప్పును ఢీకొట్టుకుని.. కింద పడ్డారు. మరికొందరు అటూఇటూ ఊగిపోయి కిటికీలను, ముందున్న సీట్లను ఢీకొట్టారు.
విమానం ఎత్తు రెండు సార్లు అకస్మాత్తుగా తగ్గిపోయిందని.. అప్పుడు సీట్ల నుంచి గాల్లోకి ఎగిరినట్లు అయ్యిందని కొందరు ప్రయాణికులు చెప్పుకొచ్చారు. విమానం కుదుపులకు గురవ్వడంతో.. అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చారు. ఇక విమానం ల్యాండ్ అయిన వెంటనే.. హొనొలులు ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ రంగంలోకి దిగి.. గాయపడిన వారికి తక్షణమే చికిత్స అందించారు. ఇక తీవ్రంగా గాయపడిన వారికి ప్రాథమిక చికిత్స చేసి.. మెరుగైన వైద్యం కోసం ఎమర్జెన్సీ రూమ్స్‌కి తరలించారు.
అనంతరం హవాయి ఎయిర్‌లైన్స్‌కు చెందిన చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఒకరు మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి సంఘటన ఈ మధ్యకాలంలో ఎన్నడు చోటు చేసుకోలేదు. ఈ ప్రమాదంలో కొందరు విమానం పైకప్పును ఢీకొట్టారు. ఇసీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. లాంటి ప్రమాదాలు జరిగినప్పుడు తీవ్ర గాయాల పాలవుతారు. ఇక తాజాగా చోటు చేసుకున్న ప్రమాదంలో.. 20 మంది గాయపడగా.. వీరిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఒకరు అపస్మారక స్థితికి చేరుకున్నారు. కొందరికి తలపై గాయాలయ్యాయి. కొందరు వాంతులు, వికారంతో బాధపడ్డారు’’ అని చెప్పుకొచ్చారు. అందరికి చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. ఈ వింత సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.