ఎక్కడైనా సరే రైల్వే క్రాసింగ్ ఉన్న చోట చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకపోతే ప్రాణాలకే రిస్క్ తప్పదు. కొన్నిసార్లు ఇలాంటి సంఘటనల వల్ల పదులు, వందలాది మంది కూడా ప్రమాదంలో పడే అవకాశముంటుంది. ఇక తాజాగా అలాంటి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో ప్రాణభయంతో జనాలు పరుగులు తీయడం మనకే భయం కలిగించేలా చేస్తోంది. విజువల్స్ కూడా ఒళ్లు జలదరించేలా ఉండటంతో ఈ విషయం కాస్త చర్చనీయాంశంగా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. మెక్సికో దేశంలోని అగ్వాస్కాలియెంటెస్ నగరంలోని ఓ రైల్వే క్రాసింగ్. ఇంధన ట్యాంకర్ అది దాటుతున్న సమయంలో సడన్ గా ట్రైన్ వచ్చేసింది. ట్రైన్ చాలా వేగంగా, ట్యాంకర్ ని ఢీ కొట్టడంతో గట్టి శబ్దాలు వచ్చాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ యాక్సిడెంట్ దెబ్బకు సమీపంలోని నివాస ప్రాంతాలకు మంటలు వ్యాపించాయి. అందులో చిక్కుకున్న 12 మందిని ఫైర్ సిబ్బంది రక్షించారు. ఇక రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగి 800 నుంచి 1000 మందిని ఇళ్లలో నుంచి ఖాళీ చేయించినట్లు ఆ ప్రాంత అధికారులు వెల్లడించారు.
మరోవైపు ఈ ప్రమాదంలో ట్రాక్ పై భారీ ఎత్తున మంటలు, దట్టమైన పొగలు వస్తున్నా సరే ట్రైన్ చాలా స్పీడుతో దూసుకెళ్లడం కనిపించింది. దీంతో ట్రాక్ పక్కనే ఆగి ఉన్న కార్లలోని జనాలు.. ప్రాణభయంతో పరుగులు తీస్తూ కనిపించారు. ఇకపోతే ఈ ప్రమాదంలో ఆయిల్ ట్యాంకర్ ట్రక్ డ్రైవర్ మరణించినట్లు తెలుస్తోంది. ఒకవేళ ట్రక్కు పేలిపోయి మంటలు చెలరేగడంతో అతడు బతికే ఛాన్సు ఉందా లేదా అనేది తెలియడం లేదు. ప్రమాదం జరగ్గానే తప్పించుకుని పారిపోయాడా అనే విషయం పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ భారీ యాక్సిడెంట్ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
*CARGO TRAIN DRIVES THROUGH FLAMES AFTER CRASHING INTO A FUEL TRUCK IN CENTRAL MEXICO, CAUSING MULTIPLE TO DOZENS OF HOMES ON FIRE.pic.twitter.com/ennX3XWgWf
— Dredre babb (@DredreBabb) October 21, 2022