ఇటీవల కాలంలో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో జరిగిన వరుస అగ్ని ప్రమాదాలు కలవరపాటుకు గురిచేశాయి. ఈ ఏడాది జనవరిలో సికింద్రాబాద్ దక్కన్ మాల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనం అయిన సంగతి విదితమే.
ఇటీవల కాలంలో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో జరిగిన వరుస అగ్ని ప్రమాదాలు కలవరపాటుకు గురిచేశాయి. ఈ ఏడాది జనవరిలో సికింద్రాబాద్ దక్కన్ మాల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనం అయిన సంగతి విదితమే. ఆ తర్వాత మార్చిలో స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్ని ప్రమాద ఘటన.. విషాద ఛాయలు నింపింది. ఈ ఘటనలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. కుషాయి గూడలో జరిగిన ప్రమాదంలో మరో ముగ్గురు మరణించారు. అంతేకాకుండా ఓ ప్లే స్కూల్‌లో ఇటీవల అగ్ని ప్రమాదం జరిగింది. అయితే ఎటువంటి ప్రాణ నష్టం కలగలేదు. తాజాగా మరో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
హబ్సీగూడలోని టేస్ట్ ఆఫ్ ఇండియా రెస్టారెంట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదాన్ని గుర్తించకపోవడంతో పక్కనే ఉన్న అన్ లిమిటెడ్ క్లాత్ షోరూమ్‌కు మంటలు వ్యాపించాయి. భారీగా మంటలు ఎగసిపడటంతో గమనించిన స్థానికులు.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. మూడు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో దట్టమైన పొగ ఆ ప్రాంతమంతా వ్యాపిస్తోంది. దీంతో ఉప్పల్ – సికింద్రాబాద్ మార్గంలో వెళ్లే ప్రయాణికులు ఈ పొగ కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. హబ్సిగూడలో పెద్ద యెత్తున ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.