బాడీబిల్డర్స్ కొందరు అతి తక్కువ కాలంలో తాము అనుకున్న ఫిట్నెస్ సాధించుటకు వివిధ రకాల స్టెరాయిడ్స్ తీసుకుంటారు. అది ఆరోగ్యానికి హానికరం. అయినా కొందరు త్వరగా కండరాల ఉత్పత్తి కొరకు మితిమీరిన ఎక్సెర్సైజ్లు చేస్తుంటారు.
చావు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. పాములు పట్టేవాడు పాము కాటుకు బలైపోయాడని ఓ సామెత ఉంది. అదే సామెత రుజువైంది. సాధారణంగా జిమ్ చేసేటప్పుడు ట్రైనర్ సూచనల మేరకు మనం ఈవెంట్స్ చేయాల్సి ఉంటుంది. దాని ప్రకారం తగిన డైటింగ్ కూడా వారి సూచించిందే తీసుకోవాలి. అలా అయితేనే బాడీ బిల్డ్ అవుతుంది. బాడీబిల్డర్స్ కొందరు అతి తక్కువ కాలంలో తాము అనుకున్న ఫిట్నెస్ సాధించుటకు వివిధ రకాల స్టెరాయిడ్స్ తీసుకుంటారు. అది ఆరోగ్యానికి హానికరం. అయినా కొందరు త్వరగా కండరాల ఉత్పత్తి కొరకు మితిమీరిన ఎక్సెర్సైజ్లు చేస్తుంటారు. ఇది గుండెపోటు రావడానికి కారణం అవుతుందని నిపుణులు తెలుపుతున్నారు.అయితే ఓ జిమ్ ట్రైనర్.. ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన బాడీ బిల్డర్ వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ మరణించాడు. పూర్తి విరాల్లోకి వెళితే..
ఇండోనేషియా బాడీబిల్డర్, అంతర్జాతీయంగా పేరు పొందిన ఫిట్నెస్ ఇన్ఫ్లూయెన్సర్ జస్టిన్ విక్కీ జిమ్ చేస్తూ ప్రాణాలు వదిలాడు. అతని వయస్సు 33 సంవత్సరాలు ఉంటుంది. సుమారు 400 పౌండ్ల బరువును(210 కేజీలు) ఎత్తుతున్న క్రమంలో మెడ విరిగి చనిపోయాడు ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది. ఈ ఘటన జూలై 15న జరిగినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
మెడ విరగడంతోపాటుగా గుండెకు, కాలేయం నరాలు దెబ్బతిని జస్టిన్ చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. అతిగా బరువులు ఎత్తే క్రమంలో తగిన జాగ్రత్తలు పాటించకపోవడమే అతను చనిపోవడానికి కారణం అని తేల్చారు. ఫిట్నెస్ కోసం అందరికి సూచనలు ఇచ్చే ట్రైనర్ సూచనలు పాటించకపోవడం ఇప్పుడు అందిరిలో చర్చనీయాంశం అయింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి.