మత ఛాందసవాదులైన తాలిబన్ల పరిపాలనలో జీవించడం కంటే చావే నయమనుకునే పరిస్థితికి వచ్చినట్టు కనిపిస్తోంది ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు. అందుకే జీవితాలను పణంగా పెట్టి మరీ.. సాహసాలకు పాల్పడుతున్నారు. ప్రాణాల మీదికి తెచ్చుకుంటోన్నారు. తాలిబన్ల పరిపాలన ఎంత భయానకంగా ఉంటుందో ఇదివరకే ఓ సారి చవి చూసిన అనుభవం ఉన్నందున ఏకంగా దేశం విడిచి వెళ్లడానికి ప్రయత్నాలు సాగిస్తోన్నారు. ఈ క్రమంలో ఊపిరి వదులుతున్నారు. అత్యంత ప్రమాదకర స్థితుల్లో వారు విమానాలు ఎక్కడానికి ప్రయత్నించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వారి దైన్య స్థితికి అద్దం పట్టాయి. ఇదే సమయంలో ఓవ్యక్తి విమానం రెక్కపై పడుకుని ప్రయాణించడం వైరల్ గా మారింది.
భయంతో పారిపోతోన్న అఫ్ఘన్స్ ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియో 4,00,000 వ్యూస్, 2,000 షేర్లు రాబట్టింది. ఇండియా టుడే యాంటీ ఫేక్ న్యూస్ వార్ రూమ్ (AFWA) వీడియో డిజిటల్‌గా సృష్టించబడిందని కనిపెట్టింది. ”కీ ఫ్రేమ్ రివర్స్ సెర్చ్’‘ లో ఈ తరహా గ్రాఫిక్స్ వీడియో బైటపడింది. దీనిలో ఒక వ్యక్తి ఎగిరే విమానంలో కుర్చీపై కూర్చుని డ్రింక్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. వీడియో ‘హ్యూ కున్ హోవా’ అని వాటర్‌మార్క్ చేయబడింది.
గ్రాఫిక్స్ ఆట అంటూ కొందరుఇదీ అని కొందరు కొట్టిపడేస్తున్నారు. మరి కొందరు నమ్మినా నమ్మకపోయినా అఫ్ఘన్ పరిస్థికి ఇది అద్దం పడుతున్నట్లే ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.
వైరల్ వీడియోతో పాటూ…ఈ తరహా మరో వీడియో కూడా ఇక్కడ చూడండి: