అఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్ల పాలన నడుస్తున్న విషయం తెలిసిందే. మత విశ్వాసాల ఆధారంగా పాలన సాగిస్తూ తాలిబన్లు.. కఠినమైన, వివక్షపూరితమైన నిర్ణయాలను బలవంతంగా ప్రజలపై రుద్దుతున్నారు. అమెరికా సైన్యాలను ఎదిరించి, అఫ్ఘానిస్థాన్‌లోని ప్రభుత్వాన్ని కూల్చేసి.. పాలనను హస్తగతం చేస్తున్న తాలిబన్లు అరాచక పాలనతో ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా పలు కఠిన ఆంక్షలు విధించిన తాలిబన్లు.. తాజాగా యునివర్సిటీల్లో మహిళలు విద్య అభ్యసించడాన్ని నిషేధించారు. గతంలో బాలికలను ప్రాథమిక, హైస్కూల్ విద్యకు దూరం చేసిన తాలిబన్లు.. మహిళలు మరిన్ని కఠిన ఆంక్షలు విధించారు.
ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి అధికారం చేపట్టిన తాలిబన్లు.. తమ పాలన గతంలోలా ఉండదని, ఈసారి ప్రజలకు, మహిళలు, మైనార్టీలకు వారి హక్కులు వారికి హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కానీ.. వాస్తవంలో మాత్రం హామీలకు భిన్నంగా పాలన సాగుతోంది. ముఖ్యంగా మహిళలు, మానవ హక్కులపై ఉక్కుపాదం మోపుతున్నారు. మహిళా ఉద్యోగులపై కఠిన ఆంక్షలు విధించారు. ఉల్లంఘించేవారికి కఠిన శిక్షలు విధిస్తున్నారు. పార్కులు, జిమ్‌లకు వెళ్లకుండా మహిళలపై నిషేధం ఉంది. ఎక్కడికైన ప్రయాణించే సమయంలో కూడా మహిళలు ఒంటరిగా ప్రయాణించకూడదు. వారికి తోడుగా ఒక పురుషుడు ఉండాల్సిందే. వీటితో పాటు తాజాగా, యూనివర్సిటీ విద్యకు ఆడపిల్లలను దూరం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు యూనివర్సిటీల్లో మహిళల ప్రవేశాన్ని తక్షణం నిలిపివేయాలని తాలిబన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
తాలిబన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శల వర్షం కురుస్తోంది. అఫ్ఘానిస్థాన్ క్రికెటర్లు సైతం తాలిబన్ల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. ‘లెట్ అఫ్ఘాన్ గర్ల్ లర్న్’ అనే హ్యాష్ ట్యాగ్‌తో ట్విట్టర్‌లో వీడియోలతో స్పందించారు. అఫ్ఘానిస్థాన్ స్టార్ ప్లేయర్లు.. రషీద్ ఖాన్, మొహమ్మద్ నబీ, గుర్బాజ్, ఫరూఖీ ట్విట్లర్‌లో యునివర్సిటీ విద్యకు ఆడపిల్లలను దూరం చేయడంపై నిరసన గళం వినిపించారు. ట్విట్టర్‌లో ఆడపిల్లలను చదువుకోనివ్వండి అంటూ పోస్టులు చేశారు. తాలిబన్లకు క్రికెటర్లు వ్యతిరేకంగా స్పందించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మహిళల విద్య గురించి క్రికెటర్లు తాలిబన్లకు ఎదురురిగడంతో వారిపై ప్రశంసలు వర్షం కురుస్తోంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#LetAfghanGirlsLearn 🙏🙏🙏 pic.twitter.com/KdEK4MXACF
— Rashid Khan (@rashidkhan_19) December 21, 2022
: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: «طَلَبُ الْعِلْمِ فَرِيضَةٌ عَلَى كُلِّ مُسْلِمٍ وَ مُسْلِمَه».
ژباړه: رسول الله صلی الله عليه وسلم وفرمايل: د علم ترلاسه کول پر هر مسلمان نارینه او ښځینه فرض دی#LetAfghanGirlsLearn pic.twitter.com/2ErwxZxmkV— Gulbadin Naib (@GbNaib) December 21, 2022
Today we stand in solidarity with our sisters and daughters of #Afghanistan in demanding that the decision on high school ban for girls and university ban for women be reversed. Every day of education wasted is a day wasted from the future of the country. 🙏#LetAfghanGirlsLearn
— Rahmanullah Gurbaz (@RGurbaz_21) December 21, 2022
#LetAfganGirlsLearn pic.twitter.com/XMJ3mc3vPB
— Mohammad Nabi (@MohammadNabi007) December 22, 2022