పొలం గట్లు అంటే ఎలా ఉంటాయో మనకి తెలుసు. రోడ్లు సాఫీగా ఉండవు. అలాంటి మట్టి రోడ్ల మీద బైక్ ని 100 స్పీడ్ లో నడపడం అనేది చాలా కష్టం. అందులోనూ ఒకసారి యాక్సిడెంట్ జరిగి చావు అంచుల వరకూ వెళ్లి వచ్చిన వారు ఆ స్పీడ్ లో వెళ్లాలంటేనే భయపడతారు. కానీ సాయిధరమ్ తేజ్ మాత్రం విరూపాక్ష సినిమాలోని రిస్కీ బైక్ సీక్వెన్స్ లో భాగంగా బైక్ ని నడిపారు.
సాయిధరమ్ తేజ్ కి 2021 సెప్టెంబర్ 10వ తేదీ ఒక పీడ కల. ఆరోజున బైక్ పై వేగంగా వస్తున్న సాయిధరమ్ తేజ్ బైక్ స్కిడ్ అవ్వడం వల్ల ప్రమాదం జరిగింది. చావు అంచుల వరకూ వెళ్లి వచ్చారు. అంత పెద్ద ప్రమాదం జరిగితే ఎవరైనా మళ్ళీ బైక్ ఎక్కాలంటే ఆలోచిస్తారు. వేగంగా వెళ్ళడానికి ఆలోచిస్తారు. కానీ సాయిధరమ్ తేజ్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. పొలం గట్ల మీద బైక్ ని వంద స్పీడ్ లో పోనిచ్చారు. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ విరూపాక్ష సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఒక సీన్ కోసం తన జీవితాన్నే రిస్కులో పెట్టారు. మేకర్స్ డూప్ ని పెడతామన్నా సరే ఒప్పుకోలేదు. ఎంత రిస్క్ అయినా పర్లేదు నేనే చేస్తాను అని రిస్కీ సీన్ ని చేశారు.
దీనికి సంబంధించిన మేకింగ్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. దర్శకుడు కార్తీక్ దండు, సినిమాటోగ్రాఫర్ శామ్ దత్ సైనుద్దీన్ సాయిధరమ్ తేజ్ ధైర్యాన్ని చూసి ప్రశంసించకుండా ఉండలేకపోయారు. కరేజ్ ఓవర్ ఫియర్.. మన సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ విరూపాక్ష సినిమాలో రిస్కీ బైక్ సీక్వెన్స్ ని ఎలాంటి భయం లేకుండా చేసి మనల్ని సర్ప్రైజ్ చేసి.. మన మనసులను గెలుచుకున్నారు’ అంటూ ఎస్వీసీసీ నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. దర్శకుడు కార్తీక్ దండు మాట్లాడుతూ.. ‘సెప్టెంబర్ లో 10న సాయిధరమ్ తేజ్ కి యాక్సిడెంట్ జరిగిన విషయం తెలిసిందే. అయితే అంత పెద్ద ప్రమాదం జరిగి చావు అంచుల వరకూ వెళ్లిన ఎవరికైనా సరే భయం అనేది ఉంటుంది.
ఒక చిన్న చెరువు కట్ట. ఒకవైపు పెద్ద చెరువు, మరోవైపు పెద్ద లోయ. ఆ కట్ట మీద 100 స్పీడ్ లో బైక్ డ్రైవ్ చేసుకుని వచ్చి సడన్ బ్రేక్ కొట్టాలి. అలా చేయడం ఎవరికైనా రిస్కే. కానీ సాయిధరమ్ తేజ్ ఈ స్టంట్ ని సింగిల్ టేక్ లో పూర్తి చేశారు’ అని అన్నారు. ఇక శామ్ దత్ మాట్లాడుతూ.. ‘యాక్సిడెంట్ అయిన తర్వాత షూట్ కి వచ్చారు. అయితే రిస్కీ బైక్ సీక్వెన్స్ ఉంది, డూప్ ని పెట్టి మ్యానేజ్ చేస్తామని అంటే సాయిధరమ్ తేజ్ రిస్కైనా పర్లేదు చేస్తా అని అన్నారు. తనలో ఉన్న భయాన్ని అధిగమించాలంటే ఈ రిస్క్ చేయాల్సిందేనని సాయిధరమ్ తేజ్ అన్నారు’ అని అన్నారు. సాయిధరమ్ తేజ్ తనలో భయాన్ని జయించడం కోసం ఈ రిస్కీ బైక్ సీక్వెన్స్ ని చేశారు.
అతని ధైర్యానికి హ్యాట్సాఫ్ అంటూ కృతజ్ఞతలు తెలియజేశారు. పొలం గాట్లు అంటే రోడ్డు గతుకులు గతుకులుగా ఉంటుంది. అలాంటి గతుకుల రోడ్డు మీద 30, 40 స్పీడ్ లో వెళ్ళడమంటేనే కష్టం. అలాంటిది వంద స్పీడ్ లో బైక్ ని నడపడం అంటే మామూలు విషయం కాదు. అందులోనూ సడన్ బ్రేక్ వేయాలి. కానీ సాయిధరమ్ తేజ్ కి డూప్ ని పెట్టుకునే అవకాశం ఉన్నా కూడా పెట్టుకోకుండా రిస్క్ చేశారు. ఇది కదా కరేజ్ అంటే అని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఊరికినే స్టార్లు అయిపోతారా చెప్పండి. మరి సాయిధరమ్ తేజ్ లైఫ్ ని రిస్క్ చేసి మరీ 100 స్పీడ్ లో బైక్ నడపడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.