అగ్రరాజ్యంలో పరిస్థితులు అంతకంతకు దిగజారుతున్నాయి. మంచు తుఫాను అమెరికాను అతలాకుతలం చేస్తోంది. ఎక్కడా ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఉష్ణోగ్రత మైనస్ 50 డిగ్రీల కంటే తక్కువగా నమోదు అవుతోంది. ఇప్పటివరకు మంచు తుఫాను కారణంగా వివిధ ప్రమాదాల్లో 34 మంది వరకు చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదం ఉన్నట్లు అందోళన వ్యక్తం చేస్తున్నారు. సహాయ చర్యలకు వెళ్లాలంటే ఏదో యుద్ధ క్షేత్రంలోకి అడుగుపెడుతున్నట్లు ఉంది.. అంటూ గవర్నర్ కార్తీ ఘోషుల్ చేసిన వ్యాఖ్యలు అక్కడి పరిస్థితులకు అద్దం పడుతున్నాయి.
అందరూ ఇళ్లలోనే ఉండాలని ఎవరు బయటకు రావద్దంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. బయటకు వస్తే గడ్డకట్టి చనిపోయే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ పరిస్థితులను చూస్తుంటే 1977 నాటి తుఫాను కంటే తీవ్రంగా ఉందంటూ ఆందోళన చెందుతున్నారు. ఎవరూ రోడ్లపైకి వచ్చే సాహసం చేయొద్దు అంటూ అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరికలు జారీ చేశారు. క్రిస్మస్ వేళ ఇలాంటి పరిస్థితులు నెలకొనడం అందరినీ తీవ్ర నిరాశకు గురి చేసింది. చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ విద్యుత్ పునరుద్ధరణ సాధ్యం కాలేదు.
This is how the #downtown area of the city of #Buffalo was left, in the state of #NewYork, United States. There is snow as far as the eye can see.#WinterStorm #WinterSolstice #US #snowstorm #Snow pic.twitter.com/9zjhZsZ4qI
— Chaudhary Parvez (@ChaudharyParvez) December 25, 2022
మరోవైపు ప్రతికూల వాతావరణం దృష్ట్యా వేలాది విమాన సర్వీసులు రద్దయ్యాయి. విమానాలు రద్దుకావడంతో.. క్రిస్మస్ కు వెళ్లలేక ప్రరజలు అంతా ఇబ్బందులు పడ్డారు. ఫ్లైట్ అవేర్ వెబ్ సైట్ ప్రకారం 2400 విమానాలు రద్దయ్యాయి. సంబరాల కోసం సొంతూళ్లు, ఇతర ప్రాంతాలకు బయలు దేరిన ప్రజలు.. మార్గం మధ్యలోనే చిక్కుకుని అవస్థలు పడ్డారు. 2 లక్షలకుపైగా ఇళ్లకు విద్యుత్ సరఫరా లేదు. దక్షిణాది రాష్ట్రాల్లో సైతం ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు కెనడాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. క్యూబెక్, ఒంటారియాలో లక్షల మందికి విద్యుత్ సరఫరా లేక అవస్థలు పడ్డారు.
Snow storm #Death toll rises to 26 as severe winter storm sweeps parts of US.#USWinterStorm #WinterStorm #WinterSolstice pic.twitter.com/yyVE9mKoEk
— Vineet Sharma (@vineetsharma94) December 26, 2022
పలు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య 34కు చేరుకుంది. రోడ్లపై మంచు కుప్పలుగా పేరుకుంది. ఇళ్లపై కూడా మంచు మేటలు వేసింది. మంచు వల్ల వాహనాలు స్టార్ట్ కాక.. మంచులో వాహనాలు ఇరుక్కుని ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే ప్రజల జీవితం మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందంటూ హెచ్చరిస్తున్నారు. అసలు రోడ్డు మీదకు వస్తే తిరిగి ఇంటికి చేరుకుంటారనే నమ్మకం లేదంటున్నారు. ఇళ్లలోనే ఉంటున్నా.. కరెంట్ లేక హీటర్లు పనిచేయక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఈ తుపాను ఎప్పుడు తగ్గుతుందోో అంటో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
WATCH: #BNNUS Reports.
Across the United States, a ferocious monster storm has claimed at least 24 lives. The storm has trapped many people inside their homes with heaps of snow and knocked out power to millions of homes and businesses.#US #Environment #Social pic.twitter.com/4R9joZp9e0
— Gurbaksh Singh Chahal (@gchahal) December 25, 2022