అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. 2024 ఎన్నికల కోసం వ్యూహాలు రచిస్తున్న విషయం తెలిసిందే. గత ఓటమిని లెక్కచేయకుండా మరోసారి తాను తప్పుకుండా అధ్యక్ష పదవికి పోటీ చేస్తానంటూ ప్రకటించారు. అయితే ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఆయన అధ్యక్ష పదవికి పోటీ సంగతి పక్కన పెడితే కటకాల పాలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటున్నారు. పరిస్థితులు చూస్తే ట్రంప్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోందనే వాదనలు వినిపిస్తున్నాయి.
క్యాపిటల్ హిల్ పై జరిగిన దాడి వెనుక డొనాల్డ్ ట్రంప్ పాత్ర ఉందనేందుకు తగిన సాక్ష్యాలను సేకరించినట్లు విచారణ కమిటీ ప్రకటించింది. 2021 జనవరి 6న క్యాపిటల్ హిల్ పై దాడికి ట్రంప్ చేసిన వ్యాఖ్యలే కారణమని, ఆ గుంపుతో ట్రంప్ కూడా చేరాలని చూశారని దాడిపై విచారణ జరిపిన కమిటీ వెల్లడించింది. మరింత అప్‌డేట్ కోసం ఎదురుచూడాలంటూ కమిటీ సభ్యుడు ఆడమ్ కిజింగర్ తెలిపారు.
విచారణ కమిటీకి ఉపాధ్యక్షురాలిగా ఉన్న రిపబ్లికన్ పార్టీ సభ్యురాలు లిజ్ ఛెనీ ఆ ఆరోపణలను ధ్రువీకరించారని తెలుస్తోంది. అంతేకాకుండా ట్రంప్ హయాంలో పనిచేసిన ఎంతోమంది ఉన్నతాధికారులు, సభ్యులు ట్రంప్ కు వ్యతిరేకంగా ఇప్పటికే సాక్ష్యం చెప్పారని తెలుస్తోంది. ఆందోళనకారులను నిలువరించే పరిస్థితి ఉన్నా ట్రంప్ ఆ పని చేయలేదని వారు ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించి ఈ నెలలోనే రెండుసార్లు వాదనలు జరగనున్నాయి. కమిటీ ఇప్పటికే సేకరించిన అన్ని ఆధారాలతో ట్రంప్ ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసే అవకాశం ఉందంటున్నారు.
కీలక డాక్యుమెంట్లను ట్రంప్ నాశనం చేశారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. అందుకే చివరి రోజుల్లో వైట్ హౌస్ లో ట్రంప్ కుటుంబ సభ్యులు గడిపిన క్షణాలను కూడా పరిశీలించనున్నారని చెబుతున్నారు. అయితే ఈ ఆరోపణలు, విచారణలు అన్నీ రాజకీయ బూటకమంటూ ట్రంప్ కొట్టిపారేస్తున్నారు. 2024లో పోటీకి సిద్ధమవుతున్నారు. అయితే క్యాపిటల్ హిల్ భవనం దాడి ఘటనలో ట్రంప్ కు వ్యతిరేకంగా తీర్పు వస్తే.. ఆయన అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవడమే కాకుండా.. జైలుకు కూడా వెళ్లాల్సి వస్తుందంటూ నిపుణులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ జైలుకు వెళ్లనున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
BREAKING: Former President Donald Trump is considering running for president in 2024, possibly as soon as the midterm elections.
“There’s discussions about an early launch, and people are planning,” a source close told @nypost. pic.twitter.com/dohiwpV3QN
— BNN Newsroom (@BNNBreaking) July 3, 2022