ఏదైనా జబ్బు చేసినా.. అనారోగ్యం పాలైనా కూడా వైద్యులను సంప్రదిస్తాం. ఆస్పత్రికి వెళ్లి ఆ వ్యాధిని నయం చేసుకోవాలి అనుకుంటాం. అలా అనారోగ్యం పాలైన యువకుడు.. చికిత్స కోసం వైద్యులను కలిశాడు. అదే అతని జీవితానికి శాపంగా మారింది. చివరికి అతని మర్మాంగాన్ని పూర్తిగా తొలగించాల్సి వచ్చింది. ఉన్న రోగం తగ్గించుకోవడానికి వెళ్తే కొత్త సమస్య ఎదురైంది. వైద్యుల పొరపాటుపై న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఆ వ్యక్తి చివరికి విజయం సాధించాడు. వైద్యులు సైతం తమ పొరపాటును అంగీకరించి.. అతనికి పరిహారం కూడా చెల్లించారు. ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
ఫ్రాన్స్ లో 2014 సంవత్సరం నాంటెస్ యూనివర్సిటిలో ఈ ఘటన జరిగింది. అప్పుడు 30 ఏళ్ల వ్యక్తి అనారోగ్యంతో వైద్యులను సంప్రదించాడు. అతడికి పరీక్షలు చేసిన వైద్యులు.. యువకుడు కార్సినోమా క్యాన్సర్ సోకినట్లు గుర్తించారు. తద్వారా శరీరం లోపల ఉండే అవయవాల టిష్యూలకు క్యాన్సర్ సోకుతుంది. యువకుడికి వైద్యం ఇవ్వడం మొదలు పెట్టారు. అప్పటికే యువకుడికి పెళ్లై, బిడ్డకూడా ఉన్నాడు. అయితే చికిత్స మధ్యలో వైద్యులు చేసిన కొన్ని పొరపాట్లు రోగికి శాపంగా మారాయి. టిష్యూలకు వచ్చిన క్యాన్సర్ కాస్తా.. అతని మర్మాంగానికి వ్యాపించింది. అది చిన్నగా మర్మాంగాన్ని పూర్తిగా పాకేసింది. అతడు మాటల్లో చెప్పలేని బాధని అనుభవించాడు.
ఆ యువకుడి మర్మాంగానికి క్యాన్సర్ సోకడం వల్ల నరకం అనుభవించాడు. ఒకానొక సమయంలో కత్తెరతో తన మర్మాంగాన్ని తొలగించుకోవాలని ప్రయత్నాలు కూడా చేశాడు. అప్పుడు యువకుడి భార్య అడ్డుకుని ఆపింది. తర్వాత వైద్యులను సంప్రదించాడు. అతడికి పరీక్షలు చేసిన అనంతరం మర్మాంగాన్ని పూర్తిగా తొలగించాలని నిర్ధారణకు వచ్చారు. శస్త్రచికిత్స చేసి మర్మాంగాన్ని పూర్తిగా తొలగించారు. వైద్యుల పొరపాటు వల్లే తనకి ఈ అంతులేని బాధ ఎదురైైందని యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తర్వాత తనకు న్యాయం చేయాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. వైద్యులు బాధితుడికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు. వైద్యులు సైతం తమ పొరపాటును అంగీకరించి.. అతనికి రూ.54 లక్షలు పరిహారం కూడా చెల్లించారు. ప్రస్తుతం ఈ ఘటన వైరల్ గా మారింది.