ఢిల్లీలో శ్రద్ధా వాకర్ ఘటన మర్చిపోక ముందే.. మరో చోట మరో యువతి బలి. అసోంలో అత్తను, భర్తను చంపి ఫ్రిజ్ లో పెట్టిన ఓ ఇల్లాలు. అత్యంత దారుణంగా హత్యలు జరుగుతున్నాయి. ఎవ్వరికీ తెలియకూడదని శవాలను ముక్కలు చేసి ఫ్రిజ్ లో దాస్తున్న తరహా ఘటనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా మరోటి చోటుచేసుకుంది.
మనుషులు చాలా జంతువుల కన్నా క్రూరంగా తయారవుతున్నారు. ఒక వ్యక్తితో విబేధాలు వస్తే.. వారి ఆలోచనల నుండి బయటపడాల్సిందీ పోయి.. వారిని కిరాతకంగా హతమారుస్తున్నారు. ఢిల్లీలో ప్రేమించిన అమ్మాయిని అత్యంత కిరాతకంగా చంపాడో కిరాతకుడు. కొన్నేళ్లు సహజీవనం చేసి.. మరో మహిళతో పెళ్లికి నిరాకరించిందన్న కారణంగా హత్య చేసి..శరీరాన్ని ముక్కలుగా కోసి ఫ్రిజ్‌లో పెట్టిన ఘటన చోటుచేసుకుంది. అసోంలో అత్తను, భర్తను చంపి ఫ్రిజ్‌లో పెట్టిన ఓ మహిళ ఉదాంతం గురించి వార్తలు విన్నాం. ఇటీవల వరుసగా ఇటువంటి ఘటనలే జరిగాయి. వీరంతా సామాన్యులు కాగా, ఇప్పుడొక సెలబ్రిటీ దారుణ హత్యకు గురైంది.
హాంగ్‌కాంగ్ మోడల్ అబ్బి చోయ్ హత్యకు గురైంది. మంగళవారం నుండి కనిపించకుండా పోయిన ఆమె మృతదేహాన్ని తైపో జిల్లాలోని ఓ ఇంట్లో కనుగొన్నారు. బహుళ అంతస్తుల్లో ఉన్న ఓ ఫ్రిజ్‌లో ఆమె కాళ్లు, శరీర భాగాలను కొన్నింటిని పోలీసులు గుర్తించారు. అయితే ఆమె తల, మొండెం, చేతుల కోసం పోలీసులు ఇంకా వెతుకుతూనే ఉన్నారు. ఆమె మృతదేహంతో పాటు మాంసం ముక్కలు, ఎలక్ట్రిక్ రంపాలు, పొడవాటి రెయిన్ కోట్లు, చేతి తొడుగులు, ముసుగులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. అదుపులోకి తీసుకున్న వారిలో ఆమె మాజీ భర్త కూడా ఉన్నారు.
దేశం వదిలి వెళ్లిపోతున్న సమయంలో అబ్బిచోయ్ మాజీ భర్త తుంగ్ చంగ్ ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఆస్తికి సంబంధించిన విషయాల కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆమె తన ఆస్తిని అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా.. మాజీ భర్త, అతడి కుటుంబ సభ్యులు వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంపైనే ఆమెను హత్య చేసి ఉండొచ్చునని పోలీసులు చెబుతున్నారు. అయితే ఆమె హత్య చేసిన ప్రాంతంలో దొరికిన ఓ సూప్ బౌల్ లో మానవ కణజాలాన్ని పోలీసులు గుర్తించారు. అదేవిధంగా మిగిలిన అవయవాల కోసం శునకాలను రంగంలోకి దింపారు. తమకు నచ్చని, వ్యతిరేకిస్తున్న వారిపై ఇలా పగ తీర్చుకుంటున్న ఈ వ్యక్తులను ఏం చేయాలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Forty minutes after the first search, police divers are starting their third and final underwater search of the day. The final pool was around waist-deep for the divers.
Each search has taken around 10 minutes pic.twitter.com/IhUyX1MTCI
— Jess Ma (@mwkjess) February 25, 2023