బ్రిటన్‌కు చెందిన ‘సచా జాఫ్రీ’ ఎంతో మంది పేద పిల్లల ఆకలి తీరుస్తున్నాడు. ఇతను ప్రసిద్ధ కళాకారుడు. ఇతను వేసిన పెయింటింగ్ కూడా అర్థవంతమైందే. ఆ బొమ్మను గీసే ముందు ప్రపంచ వ్యాప్తంగా చిన్నారులకు ఓ విజ్ఞప్తి చేశాడు. ఈ కరోనా కాలంలో వాళ్లు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు? ఒంటరిగా అయిపోయినట్టు ఫీలవుతున్నారా? అనుభవంలోకి వచ్చిన భావాలతో స్కెచెస్ వేసి పంపాలని కోరాడు. ఆ తర్వాత దుబాయ్‌లోని అట్లాంటిస్ హోటల్లో సుమారు ఏడు నెలల పాటు రోజుకు 20 గంటల సమయాన్ని వెచ్చించి ఆ పెయింటింగ్ వేశాడు. దీనికోసం 1,065 పెయింట్ బ్రష్‌లు, 6,300 లీటర్ల పెయింట్స్‌ను ఉపయోగించాడు. 70 విభాగాలుగా చిత్రించి తర్వాత ఒక్కటిగా కలిపి పదిహేడు వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో పెద్ద కాన్వాస్ పెయింటింగ్‌గా తయారు చేశాడు. ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో పేరు కూడా సంపాదించుకుంది. పైగా ఇందులో ‘జర్నీ ఆఫ్ హ్యుమానిటీ’ అనే అర్థం దాగి ఉంది.
దుబాయ్‌లోని ‘ది పామ్’ హోటల్లో నిర్వహించిన వేలంలో దీన్ని ఫ్రాన్స్‌కు చెందిన ‘ఆండ్రీ అబ్దున్’ రూ.300 కోట్లకు కొనుగోలు చేశాడు. ఆ మొత్తాన్ని రెట్టింపు చేసి ఆ డబ్బును పేద పిల్లల సహాయం కోసం స్వచ్ఛంద సంస్థలకు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.