సితార చేసిన పని తెలిస్తే.. చిన్న వయసులోనే ఇంత గొప్పగా ఆలోచించిందా అని అంటారు.
తల్లిదండ్రుల నడవడిక బట్టే పిల్లల ప్రవర్తన ఉంటుందని అంటారు. సాధారణ జనం నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరూ తమ పిల్లలు మంచిగా, గొప్పగా ఉండాలనే పెంచుతారు. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తన పిల్లలను తనలానే గొప్పగా తీర్చిదిద్దాలని చూస్తున్నారు. మహేష్ బాబు మాత్రమే కాదు.. ఇండస్ట్రీలో ఉన్న ఏ హీరో అయినా సరే పిల్లల విషయంలో ఇలానే ఉంటారు. మహేష్ బాబు కూతురు సితార గురించి చెప్పాలంటే.. ఇప్పటికే ఒక కమర్షియల్ యాడ్ లో నటించి తండ్రికి తగ్గ తనయురాలు అనిపించుకుంది. రెమ్యునరేషన్ లో తండ్రికి పోటీ కూడా ఇస్తుందని అనిపించుకుంది. అయితే పారితోషికంలోనే కాకుండా మానవత్వం చాటుకోవడంలో కూడా సితార తండ్రికి గట్టి పోటీ ఇస్తుంది.
ప్రముఖ జ్యూయలరీ బ్రాండ్ కి అంబాసిడర్ గా ఉన్న సితార.. తాజాగా మీడియాతో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో పాల్గొంది. ఆ ప్రెస్ మీట్ లో మీడియా వారు అనేక ప్రశ్నలు అడిగారు. వాటిలో సితార పారితోషికం గురించి అడిగిన ప్రశ్న ఒకటి. దానికి సితార ఇచ్చిన సమాధానానికి నెటిజన్స్ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ యాడ్ కోసం తీసుకున్న మొదటి పారితోషికాన్ని ఎవరికిచ్చారు? మీ అమ్మ గారికిచ్చారా? మీ నాన్న గారికిచ్చారా? లేక మీరే తీసేసుకున్నారా? అని పాత్రికేయుడు అడిగారు. దానికి సమాధానంగా సితార.. తన మొదటి పారితోషికాన్ని ఛారిటీకి ఇచ్చానని చెప్పింది. దీంతో ఆమెపై నెటిజన్స్ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తండ్రికి తగ్గ కూతురివమ్మా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మహేష్ బాబు కూడా యాడ్స్ ద్వారా వచ్చిన దాంట్లో చాలా వరకూ ఛారిటీల కోసం ఖర్చు చేస్తారు. యాడ్స్ రూపంలో వచ్చిన రెమ్యునరేషన్ మొత్తాన్ని చిన్న పిల్లల గుండె ఆపరేషన్స్‌కి ఖర్చు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎవరైనా ఆపదలో ఉంటే సహాయం చేయడంలో ముందుంటారు మహేష్ బాబు. ఇప్పుడు తండ్రి బాటలోనే సితార కూడా అడుగులు వేస్తుంది. మొదటి కమర్షియల్ యాడ్ కి సితార కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంత డబ్బుని ఛారిటీకి ఇవ్వడం అంటే గొప్ప విషయమనే చెప్పాలి. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ రూపంలో తెలపండి.
Like Father – Like Daughter ❤️
I Give My First Remuneration To Charity – Sitara❤️🙏 pic.twitter.com/1BIu3pSLW1
— Naveen MB Vizag (@NaveenMBVizag) July 15, 2023