నిత్యం ఎంతో మంది సామాన్య జనం ఉండటానికి ఇళ్లు, తినడానికి తిండిలేక ఇబ్బందులు పడుతుంటారు. చిన్న ఇంటిని నిర్మించుకునేందుకు కూడా రేయింబవళ్లు ఎంతో కష్టపడుతుంటారు. ఇళ్లు కట్టుకునే స్థోమ లేని వాళ్లు..ఖాళీ ప్రదేశం చూసుకుని చిన్నపాటి గుడిసైనా వేసుకుంటారు. ఇలా ఇంటికి కోసం మనష్లులే అనేక ఇబ్బందులు పడుతుంటే.. పందుల కోసం మాత్రం ఓ పెద్ద బిల్డింగే నిర్మించారు. అది కూడా ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 26 అంతస్తులతో పందుల కోసం అపార్టమెంట్ ను నిర్మించారు. కేవలం పందుల కోసం అంత పెద్ద బిల్డింగ్ ను నిర్మించారు. ఇక్కడ విశేషం ఏమిటంటే.. ప్రపంచంలోనే పందుల కోసం నిర్మించిన భవనాల్లో ఈ భవనం అతిపెద్దది. ఇది చైనాలోని హుబీ ప్రావిన్స్ ప్రాంతంలోని ఎజౌ పట్టణంలో ఉంది.
చైనాలో పందుల కోసం ఈ భారీ భవనం నిర్మించడం వెనుక ఓ బలమైన కారణం ఉంది. అది ఏమిటంటే..చైనాలో మాంసాహారంలో అతి ప్రధానమైనది పోర్క్. ఈ మాంసానికి చైనాలో మంచి డిమాండ్ ఉంది. దీంతో పోర్క్ ఉత్పత్తిపై పెంచడానికి అక్కడి ప్రభుత్వం పందులపై దృష్టి పెట్టింది. పందులను కేవలం దేశంలో వినియోగించేందుకే కాకుండా ఎగుమతుల చేసేందుకు కూడా ఉత్పత్తి చేయాలని అక్కడి ప్రభుత్వం భావించింది. అందుకే భారీ భవనాల్లో పందుల పెంపకానికి అవకాశం ఇచ్చింది. అయితే గతంలో రెండు, మూడు అంతస్తుల బిల్డింగ్స్ లో మాత్రమే పందుల పెంపకాన్ని చేసేవారు. అయితే తాజాగా 26 అంతస్తుల భవనాన్ని పందుల కోసం నిర్మించారు.
ఇందులో పందుల పెంపకం కోసం అధునాత సౌకర్యలను ఏర్పాటు చేశారు. మనుషులతో అవసరం లేకుండా కేవలం యంత్రాలే పందులకు ఆహారాన్ని అందిస్తాయి. అంతేకాక వాటి విశాలమైన గదులో ఉంచి.. ఎటుంటి రోగాలు, ఇన్ ఫెక్షన్స్ సోకకుండా ఆధునిక పద్ధతులను ఉపయోగిస్తున్నారు. అనేక రకమైన జాగ్రత్తలతో పందుల పెంపకాన్ని ఈ భవనంలో నిర్వహిస్తోన్నారు. కేవలం భవనం ద్వారానే నెలకు 54 వేల టన్నులు, సంవత్సరానికి 60 లక్షల టన్నుల పంది మాంసం ఉత్పత్తి అవుతుంది. ప్రస్తుతం ఈ కొత్త భవనంలో దాదాపు 6.5 లక్షల పందులను పెంచుతున్నారు. అంతేకాక వీటి ద్వారా వచ్చే వ్యర్థాలతో బయోగ్యాస్, విద్యుత్ ఉత్పత్తి వంటివి చేస్తున్నారు. అయితే ఇలా భవనాల్లో పందుల పెంపకం పలువురు నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
జనావాస ప్రాంతంలో భవనాల్లో పందులను పెంచడం వలన ఆరోగ్య పరంగా ఇబ్బందులు ఎదురవుతాయని నిపుణులు అంటున్నారు. గతంలో యూరప్ లో ఇలాంటి నిర్మాణాలే చేపట్టారు. ప్రస్తుతం వాటిల్లో చాలా వరకు మూతపడ్డాయి. అయితే తాజాగా చైనాలో నిర్మించిన ఈ 26 అంతస్తుల భవనంకి ప్రత్యేక గుర్తింపు దక్కింది. ప్రపంచంలోనే పందుల కోసం ఏర్పాటు చేసిన భవనాల్లో చైనాలో నిర్మించిన ఈ 26 అంతస్తుల భవనం అతి పెద్దది. ఈ భవనంకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.