ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో.. సగటు ఉద్యోగి పరిస్థితి ఓ యంత్రంలా తయ్యారు అయ్యింది. అయితే తాజాగా పలు కంపెనీలు వారానికి 4 రోజులే పని చేయించుకుని 3 రోజులు సెలవులు ఇవ్వనున్నాయి. వినడానికి ఎంతో సంతోషంగా ఉన్న ఈ వార్త గురించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో.. సగటు ఉద్యోగి పరిస్థితి ఓ యంత్రంలా తయ్యారు అయ్యింది. దాంతో ఎప్పుడెప్పుడు వీక్ ఆఫ్ వస్తుందా అని ఎదురు చూడటం సహజమే. ఇక ఇప్పటికే సాఫ్ట్ వేర్ కంపెనీలు వారానికి 5 రోజులు పని దినాలను పెట్టి.. రెండు రోజులు సెలవులు ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా పలు కంపెనీలు వారానికి 4 రోజులే పని చేయించుకుని 3 రోజులు సెలవులు ఇవ్వనున్నాయి. వినడానికి ఎంతో సంతోషంగా ఉన్న ఈ వార్త గురించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
కంపెనీ విజయాలకు, అపజయాలకు కారణం ఉద్యోగులే. దాంతో వారి బాగోగులు ఎంత చక్కగా చూసుకుంటే వారు అంత మంచిగా కంపెనీ అభివృద్దికి కృషి చేస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ప్రస్తుతం యూరోపియన్ దేశాల్లోని ప్రముఖ కంపెనీలు గత కొద్ది నెలలుగా వారానికి 4 రోజులే పనిని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తూనే ఉన్నారు. తాజాగా ఈ ప్రయోగాన్ని పూర్తి స్థాయిలో అమలు చెయ్యాలని బ్రిటన్ కంపెనీలు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు సుమారు 61 కంపెనీలు గత సంవత్సరం జూన్ నుంచి డిసెంబర్ వరకు ఆరు నెలల పాటు వారాని 34 పని గంటల విధానాన్ని ఉద్యోగుల జీతాల్లో కోత విధించకుండా ప్రయోగాత్మకంగా పరిశీలించాయి.
ఈ క్రమంలో వాటిల్లో కొన్ని కంపెనీలు ఇదే విధానాన్ని మరికొన్నాళ్లు కొనసాగిస్తామని అంటుండగా.. 18 కంపెనీలు మాత్రం వారాని 4 రోజుల పని దినాలనే శాశ్వతంగా కొనసాగించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అయితే నాలుగు రోజుల పని విధానంతో ఉత్పాదకతలో ఎలాంటి తేడా లేదని ఆయా కంపెనీలు చెప్పడం విశేషం. ఈ విధానంలో ఎప్పటికప్పుడు ఉద్యోగాలకు రాజీనామ చేసే ఉద్యోగుల సంఖ్య కూడా తగ్గినట్లు సర్వేల్లో తేలింది. మరి వారానికి 4 రోజులే పని దినాలు అనే కాన్సెప్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.