కరోనా వైరస్ మహమ్మారి కొన్ని దేశాల్లో విస్తరిస్తోంది. మరికొన్ని దేశాల్లో తగ్గింది అనే చెప్పాలి. పెద్ద ఎత్తున కరోనా కేసులు నమోదు అవుతున్నాయి కొన్ని దేశాల్లో. అందుకే అక్కడ మళ్లీ లాక్ డౌన్ పెడుతున్నారు. మాస్క్ ధరించకపోతే ఫైన్ విధిస్తున్నారు. ఓ పక్క వేగంగా వ్యాక్సిన్ డ్రైవ్ చేపడుతున్నా కేసులు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు.మనుషులకే కాదు ఇటీవల కాలంలో జంతువులకూ సోకుతోంది ఈ కరోనా వైరస్ . అమెరికాలో ఓ జింకకు కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే ఇలా జంతువులకి సోకడంతో చాలా మంది ఆందోళన చెందుతున్నారు. అయితే ఎలా సోకింది అనేది మాత్రం తెలియడం లేదు. అమెరికాలో నమోదైన తొలికేసు ఆందోళన కల్గిస్తోంది. ఈ దేశంలో తొలిసారిగా జింకకు కరోనా వైరస్ సోకింది.
అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో అడవి తెల్లతోక జింకకు కోవిడ్ 19 వైరస్ సోకిందని అమెరికా వ్యవసాయశాఖ పేర్కొంది. జింకకు వైరస్ ఎలా సోకిందనేది ఇంకా అర్ధం కాలేదు. మనుష్యుల ద్వారానో లేదా ఇతర జింకలు, జంతు జాతుల ద్వారా వైరస్ సోకి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. ఓహియో రాష్ట్రంలో ఓ తెల్ల తోక జింకకు వైద్య పరీక్షలు నిర్వహించగా, అది వైరస్ బారినపడిన విషయం వెల్లడైంది. జంతువుల నుంచి మనుషులకి – అలాగే మనుషుల నుంచి జంతువులకి కరోనా సోకుతుందా అనే దానిపై పరిశోధన చేపట్టారు పరిశోధకులు.
కొన్ని జంతువులకి టెస్టులు చేశారు. అందులో జింకకు కరోనా సోకింది . గతంలో కూడా కొన్ని ఇతర జంతువులకు కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ కుక్కలు పిల్లులు సింహాలకు కరోనా సోకడం చూశాం. తొలిసారి జింకకు కరోనా సోకింది అని వింటున్నాం.