తమ కలల జీవితాన్ని ఆకాశానికి అందనంతగా ఊహించుకున్నారు. పిల్ల పాపలతో కళకళలాడుత జీవించాలనుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులలు, శ్రేయోభిలాషుల నడుమ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. కానీ, కొద్ది గంటలలోనే ఊహించని ప్రమాదం ఎదురై.. వారి జీవిత చిన్నాభిన్నం చేసింది.
పెళ్ళి అంటే నూరేళ్ల పంట. ఇరువురు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులను, శ్రేయోభిలాషులను పిలిచి అందరి మధ్య అంగరంగ వైభవంగా జరుపుకునే తంతు. ఎన్నో ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టే యువ జంట సంతోషానికి హద్దులుండవు. అలానే ఈ జంట ఎన్నో ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. కానీ వీరిని చూసి విధికి కన్ను కుట్టిందేమో వారి ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. నిండు మనసుతో మనువాడిన కొద్ది గంటలలోనే ఊహించని ప్రమాదం ఎదురై.. వారి జీవితాలను చిన్నాభిన్నం చేసింది. ఈ విషాద ఘటన అమెరికాలో జరిగింది. ఆ వివరాలు..
అమెరికాలోని సౌత్ కరోలినాకు చెందిన సమంతా హాచిన్సన్ అనే వధువుకు ఆరిక్ హచిన్సన్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వారిరువురు బంధుమిత్రుల, కుటుంబసభ్యుల మధ్య ఉంగరాలు మార్చుకొని ఒక్కటయ్యారు. అనంతరం ఊరేగింపుగా మోటరైజ్డ్ వాహనం గోల్ఫ్ కార్టులో బయల్దేరారు. ఇంతలోనే వేగంగా దూసుకు వచ్చిన ఓ కారు వీఋ ప్రయాణిస్తున్న గోల్ఫ్ కార్టును ఢీకొట్టింది. దీంతో వీరి గోల్ఫ్ కార్టు దాదాపు 90 మీటర్ల దూరం ఎగిసి పడింది. ఈ ప్రమాదంలో వధువు మరణించగా, వరుడు తీవ్రంగా గాయపడ్డాడు. కారు డ్రైవర్ మద్యం మత్తులో డ్రైవింగ్ చేసినట్లు స్ధానికులు తెలిపారు.
HORRIBLE. HOW CAN THIS HAPPEN? Newlywed Bride Killed and Groom Seriously Injured in Drunk Driving Tragedy Just Moments After Wedding Reception in South Carolina. Please go to their GodFundMe Page. https://t.co/VQBI69qemJ pic.twitter.com/yW4h9DHLYQ
— Simon Ateba (@simonateba) May 1, 2023
పెళ్లి కొడుకుకు ఎముకలు విరిగిపోయాయని.. మెదడుకు గాయమైందని వరుడి తల్లి వాపోయింది. పెళ్ళైన 5 గంటల్లోనే ఈ విషాద ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. వరుడి తల్లి కోడలు అంత్యక్రియలకు, కొడుకు హాస్పత్రి బిల్లులు చెల్లిచేందుకు ఫండ్ రైజింగ్ మొదలు పెట్టారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ ను అరెస్ట్ చేశారు.పెళ్లింట ప్రమాదం జరగటంతో ఇరు కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. ఈ విశద ఘటనపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Bride killed and groom seriously injured by drunk driver in South Carolina on their wedding day 😔 pic.twitter.com/EBlaxMzi3U
— Daily Loud (@DailyLoud) May 2, 2023