రెండేళ్ల క్రితం కరోనా సృష్టించిన ఆరాచకం అంతాఇంతా కాదు. ఆ మహమ్మారి దెబ్బకు ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కరోనా దెబ్బకు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఇబ్బందులు పడ్డారు. కరోనా కారణంగా కొందరు సెలబ్రిటీలు మరణించిన సంగతి తెలిసిందే. మరికొందరు ఈ మహమ్మారి బారిన పడి తిరిగి కోలుకున్నారు. అయితే తాజాగా ఓ బాలీవుడ్ నటికి మరోసారి కరోనా పాజిటీవ్ అని తేలింది.
రెండేళ్ల క్రితం కరోనా మహమ్మారి సృష్టించిన విలయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ కోవిడ్ ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంది. అలానే ఎన్నో కుటుంబాలను రోడ్డుపాలు చేసింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఏదో ఒకరకంగా అది వ్యాపిస్తూనే ఉంది. ఇటీవల కొంతకాలం నుంచి కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ మహమ్మారి దెబ్బకు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ అల్లాడిపోతున్నారు. ఇప్పటికే కొందరు సెలబ్రిటీలు కరోనా కారణంగా మరణించగా, మరికొందరు ఆ మహమ్మారి నుంచి కోలుకున్నారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటి, పార్లమెంట్ సభ్యురాలు కిరణ్ ఖేర్ కు కరోనా సోకింది. గతంలో ఆమెకు ఓ సారి కరోనా పాజిటీవ్ రాగా తాజాగా మరోసారి వచ్చింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు.
బాలీవుడ్ నటి, పార్లమెంట్ సభ్యురాలు కిరణ్ ఖేర్ కోవిడ్ పాజిటీవ్ వచ్చింది. ఇటీవలే కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటీవ్ అని తేలింది. సోమవారం రాత్రి కిరణ్ ఖేర్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అంతేకాక తనతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరినీ కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని చేయమని ఆమె కోరారు. “కోవిడ్-19 కోసం, నా పరీక్ష ఫలితాలు పాజిటీవ్ గా వచ్చింది. అందువల్ల, నాతో కలిసిన ప్రతి ఒక్కరినీ పరీక్షలు చేసుకోవల్సిందిగా కోరుతున్నాను” అని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం చండీగఢ్ ఎంపీగా ఉన్న ఆమెకు 2021లో మల్టిపుల్ మైలోమా అనే బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.
కానీ ఆమె క్యాన్సర్ కోలుకున్న తర్వాత తిరిగి తన విధుల్లో యాక్టీవ్ గా ఉన్నారు. అప్పట్లో చికిత్స కోసం ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రికి వెళ్లింది. అలాంటి విపత్కర పరిస్థితుల నుంచి బయటపడి ఎంతో మందికి ధైర్యానికి ఇవ్వడమే కాకుండా ఆదర్శంగా నిలిచారు. అదే సంవత్సరం మార్చిలోదేశంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ ప్రచారంలో భాగమైనందుకు ఆమె ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రి నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఆమె భర్త ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ అన్న విషయం అందరికి తెలిసిందే. ఆయన అనేక బాలీవుడ్ చిత్రాలో నటించి ప్రత్యేక గుర్తింపు పొందారు. ఇటీవల తెలుగులోనూ కార్తీకేయ-2లో ప్రధాన పాత్రలో నటించి అందరిని మెప్పించారు. మరి.. మరోసారి కరోనా కేసులు విజృభిస్తుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
I have tested positive for Covid. So anyone who has come in contact with me please get yourself tested.
— Kirron Kher (@KirronKherBJP) March 20, 2023