ఈ ప్రపంచంలో డబ్బును ఖర్చు చేసే మనిషి ఉన్నాడు కానీ, మనిషి ఖర్చు చేసే డబ్బు లేదు. ఇక్కడ డబ్బులో మార్పు లేదు. దాన్ని ఖర్చు చేసే మనిషిలోనే నిరంతంర మార్పు వస్తూ ఉంటుంది.
కోర్కెలే అన్ని కష్టాలకు మూలమని.. మనిషి కోరికల్ని జయించాలని బుద్ధ భగవాణుడు చెప్పాడు. చాలా మంది బౌద్ధులు సన్యాసం తీసుకుని కోర్కెలకు దూరంగా ఉంటూ.. ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. కానీ, బౌద్ధ మతాన్ని పాటించే కొంతమంది మాత్రం కోర్కెల కోసం బుద్ధుడ్ని ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఓ వ్యక్తి తన కోర్కెల్ని బుద్ధుడికి చెప్పుకోవటానికి ఏకంగా 2000 కిలో మీటర్లు ప్రయాణించాడు. తన వింత కోర్కెల్ని బుద్ధుడికి చెప్పుకున్నాడు. అది కూడా ఓ వెరైటీ పద్దతిలో.. ఆ రెండు కోర్కెలు ఏంటంటే.. అతడికి 14 కోట్ల రూపాయలు.. ఓ లవర్ కావాలంట. ఈ రెండు కోర్కెల్ని తీర్చమని బుద్ధుడ్ని అడగటానికి అతడు ఏం చేశాడో తెలుసుకోవాలంటే పూర్తి స్టోరీ చదివేసేయండి.
చైనాకు చెందిన ఝాంగ్‌కు 27 సంవత్సరాలు. కోట్ల రూపాయల డబ్బు సంపాదించాలని, ఓ మంచి ప్రియురాలితో లైఫ్ ఎంజాయ్ చేయాలని అతడి కోరిక. అయితే, తాను చేసే పనితో అంత డబ్బు సంపాదించటం చాలా కష్టం. అందుకే తన కోర్కెలు తీరుస్తాడన్న నమ్మకంతో ఓ భారీ బుద్ధ విగ్రహం దగ్గరకు వెళ్లాడు. ఆ విగ్రహాన్ని చేరుకోవటానికి అతడు 12 గంటల పాటు ఏకంగా 2 వేల కిలో మీటర్లు ప్రయాణించాడు. ఆ విగ్రహం దగ్గరకు వెళ్లగానే ఓ పెద్ద స్పీకర్‌ను బుద్ధుడి చెవి దగ్గర పెట్టాడు. దాని ద్వారా తన కోర్కెలను బలంగా బుద్ధుడికి చెప్పుకున్నాడు. ఈ సంఘటనపై ఝాంగ్ మాట్లాడుతూ.. ‘‘ నాకు 27 సంవత్సరాలు.
నాకు కారు, ఇళ్లు లేవు. ప్రియురాలు కూడా లేదు. మొదటగా నేను బాగా డబ్బున్న వాడిని కావాలి. నాకు పెద్దగా డబ్బు అక్కర్లేదు. ఓ 12 కోట్ల రూపాయలు సరిపోతాయి. నాకు ఓ ప్రియురాలు కూడా కావాలి. ఆమె కొంచెం అందంగా ఉన్నా సరిపోతుంది. ఆమె నా డబ్బుకంటే ఎక్కువగా నన్ను ప్రేమించాలి’’ అని అన్నాడు. ప్రస్తుతం ఇతడు చేసిన వింత పని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.