మనిషి బతకాలంటే అప్పుడప్పుడు అదృష్టం కూడా కలిసి రావాలి. కొన్ని కొన్ని సందర్భాల్లో ఆక్సిడెంట్లో కొంతమంది ప్రాణాలు పోవాల్సిన పరిస్థితుల్లో వారి బతికి బట్ట కడుతుంటారు. అది వారి అదృష్టమని అందరూ అంటుంటారు. ఇదే అదృష్టమే ఓ వ్యక్తి రూపంలో అమెరికాలోని ఓ వ్యక్తి కలిసొచ్చింది. న్యూయార్క్‌లోని యూనియన్ స్కేర్ రైల్వేస్టేషన్లో ఓ ఘటన చోటు చేసుకుంది. కొద్ది క్షణాల్లో రైలు పట్టాల మీదకు రానుంది. అందరూ ట్రైన్ ఎక్కేందుకు అంతా సిద్దంగా ఉన్నారు.
అంతలోనే ఓ వీల్ చైర్‌పై వస్తూ..హఠాత్తుగా ట్రైన్ పట్టాలపై పడిపోయాడు. అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఇక అటు నుంచి ట్రైన్ రానే వస్తోంది. అతడిని రక్షించేందుకు అందరూ ఏం చేయాలని అందరూ అనుకుంటున్న తరుణంలోనే హఠాత్తుగా ఓ వ్యక్తి పట్టాలపై దూకాడు. దీంతో వెంటనే వీల్ చైర్ పైకి పడేసి పడిపోయిన ఆ వికలాంగుడిని ప్లాట్ ఫామ్‌పైకి తీసుకొచ్చిన వెంటనే ట్రైన్ వెళ్లిపోయింది. దీంతో వాళ్లిద్దరు సురక్షితంగా భయటపడ్డారు. దీంతో అక్కడున్న వాళ్లంత కాపాడిన వ్యక్తిని చప్పట్లు కొడుతూ ప్రసంశలు కురిపించారు.