నిత్యం బాంబు మోతలు, ఆత్మహుతి దాడులతో కల్లోలంగా ఉండే దాయాది దేశం పాకిస్తాన్ లో మరో సారి రక్తపుటేరులు పారాయి. ముష్కరులు జరిపిన ఉగ్రదాడిలో సుమారు 100 మంది సైనికులు అసువులు బాశారు. ఈ సంఘటన పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ లో చోటు చేసుకుంది. మిలటరీ బేస్‌లను లక్ష్యంగా చేసుకొని తిరుగుబాటుదారులు ఆత్మాహుతి దాడులకు తెగబడ్డారు.
పంజూర్, నోష్కీ పోస్టులపై రెండు ఆత్మాహుతిదాడులు జరిగాయి. ఒక్కో దాడిలో ఆరుగురు సూసైడ్ బాంబర్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ దాడుల్లో వందల మంది పాక్ సైనికులు మరణించినట్లు సమాచారం. కాగా, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చైనా పర్యటనకు ముందు ఈ దాడులు జరగడం పాక్ ప్రభుత్వ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. ప్రధాని పర్యటన రద్దువుతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.