మహ్మద్ షమీ.. ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ లో కీలకమైన ఫాస్ట్ బౌలర్. ఇప్పుడు అన్నీ ఫార్మేట్ లోనూ షమీకి జట్టులో స్థానం ఉంది. ఇక తాజాగా జరిగిన లార్డ్స్ టెస్ట్ లో తన మెరుపు బ్యాటింగ్ తో టీమ్ ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు మహ్మద్ షమీ. ఆ తరువాత బాల్ తోనూ చెలరేగిపోయాడు. ఇలా.. ప్రొఫెషనల్ గా షమీ కెరీర్ మంచి స్వింగ్ లో ఉంది.
అయితే.., వ్యక్తిగతంగా మాతం ఈ క్రికెటర్ గత కొంత కాలంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా షమీ భార్య హసీన్ జహాన్ షమీకి చుక్కలు చూపించేస్తోంది. వీరిద్దరూ చాలా కాలంగా విడిగానే ఉంటున్నారు. గతంలో ఈమె షమీపై దారుణమైన లైంగిక ఆరోపణలు చేసింది. తన భర్తకు వేరే మహిళతో సంబంధ ఉందని ఏకంగా కోర్టుకెక్కింది. కానీ.., అక్కడ ఇవేవి నిరూపితం కాలేదు. దీంతో.. విడాకులు తీసుకోకపోయినా ఈ జంట కలసి ఉండటం లేదు.
ఇక షమీ భార్య హసీన్ జహాన్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్. ఇక్కడ తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేస్తూ.., ఫాలోవర్స్ ని కవ్వించడం ఆమెకి అలవాటు. తాజాగా హసీన్ జహాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ బోల్డ్ ఫోటో షేర్ చేసింది. ఈ ఫొటోలో హసీన్ తెలుపు రంగు రగ్గడ్ జీన్స్, బ్లాక్ టాప్ ధరించి.., కాస్త హాట్ గానే దర్శనం ఇస్తోంది. దీంతో ఈ బోల్డ్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ఫోటో చూసిన నెటిజన్స్ మాత్రం హసీన్ జహాన్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. “పెళ్లై ఓ బిడ్డకు తల్లివి అయ్యావ్.. అయినా కూడా ఇంత ఎక్స్‌పోజింగ్ అవసరమా” అంటూ మండిపడుతున్నారు. “నీ భర్త దేశం తరుపున క్రికెట్ ఆడుతూ.. రోజురోజుకి హీరో అయిపోతున్నాడు. నువ్వు మాత్రం రోజురోజుకి అతని పరువు ఎలా తీయాలా అని ఆలోచిస్తున్నావు” అంటూ మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక భర్య హసీన్ జహాన్ ఆరోపణల తరువాతనే.. షమీ తనలోని నిజమైన ఆటని బయటకి తీసి స్టార్ ప్లేయర్ గా ఎదగడం విశేషం. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.