బిజినెస్ డెస్క్- మార్కెట్ లోకి ప్రతి రోజు ఓ కొత్త టీవీ వస్తూనే ఉంది. ఆధునిక టెక్నాలజీతో వచ్చే స్మార్ట్ టీవీలకు ఆధరణ కూడా బాగానే ఉంది. ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ ఇఫ్ ఫాల్కన్ భారత్ లో కొత్త టీవీలను లాంచ్ చేసింది. ఈ ఎఫ్2ఏ సిరీస్ టీవీల్లో అద్బుతమైన ఫీచర్స్ ఉన్నాయి. ఎఫ్2ఏ సిరీస్ టీవీల్లో ఏ ప్లస్ గ్రేడ్ ఫుల్ హెచ్‌డీ ప్యానెల్‌ను అందిస్తున్నారు. ఇందులో హెచ్‌డీఆర్ ఫీచర్ కూడా ఉంది.
ఈ టీవీల్లో మైక్రో డిమ్మింగ్, డైనమిక్ కాంట్రాస్ట్ ఫీచర్లను పొందుపరిచారు. ఇక మైక్రో డిమ్మింగ్ ఫీచర్ టీవీలో ప్లే అయ్యే మొత్తం కంటెంట్‌ను 512 ప్రత్యేకమైన జోన్లుగా విభజించి, బ్రైట్‌నెస్, డార్క్‌నెస్‌ను ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేస్తుందట. ఈ ఫీచర్ తో టీవీ వీక్షణ అనుభవం మరింత దృశ్యభరితం అవుతుంది. ఎఫ్2ఏ సిరీస్ టీవీల్లో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ, గూగుల్ వాయిస్ సెర్చ్ నావిగేషన్‌ను మరింత సులభం చేస్తాయని కెంపెనీ చెబుతోంది. అంతే కాదు ఈ టీవీల్లో బిల్ట్ ఇన్ గూగుల్ అసిస్టెంట్ ఫీచర్ సైతం ఉంది.
దీంతో వినియోగదారులు తమకు కావాల్సిన కంటెంట్‌నను ఎప్పుడు కావాలనుకుంటే చూడవచ్చన్నమాట. తమకు కావాల్సిన కంట్రోల్ ను పొందేందుకు ఇఫ్‌ఫాల్కన్ వాయిస్ రిమోట్ అద్భుతంగా పనిచేస్తుంది. హెచ్‌డీఆర్ టెక్నాలజీ ద్వారా వినియోగదారులు అన్ని సోర్స్‌ల నుంచి హెచ్‌డీఆర్ కంటెంట్‌ను వీక్షించవచ్చు. ఇక డాల్బీ ఆడియో, బిల్ట్ ఇన్ స్టీరియో స్పీకర్, స్మార్ట్ వాల్యూమ్ ఫీచర్స్ సైతం ఈ టీవీల్లో ఉన్నాయి.
అంతే కాదు స్మార్ట్ వాల్యూమ్ ఫీచర్ ద్వారా మీరు చూసే కంటెంట్‌ను బట్టి సౌండ్ ఆటోమెటిక్ గా అడ్జస్ట్ అవుతుండటం విశేషం. ఇక ఈ టీవీలో స్పోర్ట్స్ మోడ్ కూడా ఉంది. మీరు చూసే స్పోర్ట్స్‌ను బట్టి దీని సౌండ్, ఇమేజ్ క్వాలిటీ పెరుగుతుంది. ఈ టీవీలకు సంబంధించిన సేల్ అమెజాన్‌లో జరగనుంది. ఇఫ్ ఫాల్కన్ టీవీల ధర 13,499 రూపాయల నుంచి మొదలవుతుంది.