స్పెషల్ డెస్క్- ప్రపంచ టెక్ దిగ్గజం, ప్రముఖ ఇంటర్ నెట్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ తన యూజర్లకు ఓ హెచ్చరిక జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 కోట్ల క్రోమ్ యూజర్లకు పెనుప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని గూగుల్ స్పష్టం చేసింది. క్రోమ్ బ్రౌజర్ అప్ డేట్ ప్రపంచవ్యాప్తంగా అనేక వెబ్ సైట్లను విచ్ఛిన్నం చేసే అవకాశం ఉందని గూగుల్ యూజర్లను అలర్ట్ చేసింది.
గూగుల్ తన క్రోమియంబగ్ ట్రాకర్ బ్లాగ్ లో ఈ విషయాన్ని పేర్కొంది. ఐతే వచ్చే అనిశ్చితికి ఇప్పటివరకు ఎలాంటి పరిష్కారం లేకపోవచ్చునని గూగుల్ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఐతే ఈ సమస్య పరిష్కారానికి తన వంతుగా గూగుల్ ప్రయత్నాం చేస్తునట్లు సమాచారం. ఐతే ఏ వెబ్సైట్లకు ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయనే విషయాన్ని మాత్రం గూగుల్ తెలపలేదు.
ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు క్రోమ్ యూజర్లు ఇతర ఇంటర్నెట్ బ్రౌజర్లను ఉపయోగించుకోవాలని ఫోర్బ్స్ తన నివేదికలో తెలిపింది. గూహుల్ క్రోమ్ యూజర్లు కాస్త అప్రమత్తంగా ఉండడమే మంచిదని పేర్కొంది. వచ్చే నెల జనవరిలో గూగుల్ క్రోమ్ యూజర్లకు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
గూగుల్ క్రోమ్ వెర్షన్స్‌లో సమస్య ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం క్రోమ్ బ్రౌజర్ 96 వెర్షన్లో ఉంది. అయితే గూగుల్ మరిన్ని ఫీచర్స్‌ను యూజర్లకు అందుబాటులోకి తెచ్చేందుకు క్రోమ్ కానరీ బ్రౌజర్‌ను గూగుల్ పరీక్షిస్తోంది. ఇది ప్రారంభ యాక్సెస్ డెవలపర్ బిల్డ్. ఇప్పుడు ఇది వెర్షన్ 99లో ఉంది. ఎప్పుడైతే బ్రౌజర్ వెర్షన్ 100కి చేరుకుంటే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
గూగుల్ చేసే ఈ మార్పుల వల్ల కలిగే గ్లిచ్‌తో ప్రభావితమైన వెబ్ సైట్లు స్పష్టంగా లోడ్ అవడం ఆగిపోతాయని ఫోర్బ్స్ తెలిపింది. దీనికి కారణం ఈ వెబ్సైట్లు యూజర్లు సైట్‌ను సందర్శించే సమయంలో క్రోమ్ వెర్షన్‌ను తనిఖీ చేస్తాయి. అయితే ప్రోఫెషనల్ వెబ్సైట్ డిజైనర్ డూడా వంటి డిజైన్ సాఫ్ట్ వేర్ మొదటి రెండు అంకెలను మాత్రమే తనిఖీ చేస్తుంది. ఈ సమయంలో క్రోమ్ బ్రౌజర్ వెర్షన్ 100కు యాక్సెస్ ఉండే అవకాశాలు తక్కువగా ఉండనున్నాయని పోర్బ్స్ పేర్కొంది.