ఆంధ్రప్రదేశ్‌లోని జగన్ సర్కార్ పేద, మధ్యతరగతి ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చింది. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాక ముందు చేపట్టిన పాదయాత్రలో నవరత్నాల పేరిట ఇచ్చిన హామీలను సీఎం పదవిని అధిరోహించిన తర్వాత విడతల వారీగా
ఆంధ్రప్రదేశ్‌లోని జగన్ సర్కార్ పేద, మధ్యతరగతి ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చింది. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాక ముందు చేపట్టిన పాదయాత్రలో నవరత్నాల పేరిట ఇచ్చిన హామీలను సీఎం పదవిని అధిరోహించిన తర్వాత విడతల వారీగా అమలు చేస్తూ వస్తున్నారు. అమ్మఒడి, చేయూత, విద్యాదీవెన, వసతి దీవెన, వాహన మిత్ర, సున్నావడ్డీ వంటి సంక్షేమ పథకాలతో ఆయా వర్గాల వారికి ఆర్థిక సాయాన్ని అందిస్తుంది ఏపీలోని జగన్ సర్కార్. ఇప్పటికే ఈ పథకాల ద్వారా అనేక మంది లబ్దిపొంది ఉన్నారు. ఇప్పుడు మరోసారి ఓ శుభవార్తతో ముందుకు వచ్చింది. చిరు వ్యాపారులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు తీసుకు వచ్చిన జగనన్న తోడు పథకం కింద డబ్బులు జమ చేయనుంది.
చిరు వ్యాపారులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. జగనన్నతోడు పథకంలో భాగంగా నాల్గవ ఏడాది కూడా రూ. 10వేల చొప్పున లబ్దిదారులకు వడ్డీ లేని రుణాలను అందిస్తుంది. ఈ నెల 18 అనగా మంగళవారం 5.1 లక్షల మంది ఖాతాల్లో రూ. 10 వేల చొప్పున రూ. 510 కోట్లను అందించనుంది. అలాగే వడ్డీ మాఫీ కింద 4.58 లక్షల మందికి రూ.10.03 కోట్లను చెల్లించనుంది. పాదయాత్ర సమయంలో చిరు వ్యాపారుల కష్టాలు చూశానని.. అప్పుడే వారికి ఏదైనా మంచి చేయాలని ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకువస్తున్నట్లు గతంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. కుటుంబ ఆదాయం గ్రామాల్లో అయితే రూ.10 వేలకు లోపు, పట్టణాల్లో రూ.12 వేలులోపు ఉన్న వారు ఈ పథకానికి అర్హులు. విద్యుత్ వినియోగం 300 యూనిట్లలోపు ఉండాలి. పొలం 10 ఎకరాలకు లోపు ఉండాలి. షాపు ఉంటే కనుక రిజిస్ట్రేషన్ పత్రం కావాలి.ఈ అర్హతలు ఉన్నవారికి ఏపీ ప్రభుత్వం జగనన్న తోడు పథకం కింద రూ.10వేల రుణం అందిస్తోంది.