ఎస్‌బీఐ కార్డ్ కస్టమర్లకు గుడ్ న్యూస్ ని అందించింది. అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన కస్టమర్లకు ఎన్నో రకాల సర్వీసులు అందిస్తోంది. బ్యాంక్ డిపాజిట్ల దగ్గరి నుంచి రుణాల వరకు ఎన్నో సేవలు ఆఫర్ చేస్తోంది. వీటిల్లో క్రెడిట్ కార్డ్స్ కూడా ఒక భాగమే. కొత్త క్రెడిట్ కార్డును మార్కెట్‌లోకి తీసుకు వచ్చింది. ఈ కార్డ్స్ ని లైఫ్‌స్టైల్ రిటైల్ చెయిన్ ఫ్యాబ్ ఇండియాతో ఎస్‌బీఐ ఆవిష్కరించింది. ఇది కో బ్రాండెడ్ కాంటాక్ట్‌లెస్ క్రెడిట్ కార్డు. ఈ క్రెడిట్ కార్డు తీసుకోవడం వల్ల రూ.1500 విలువైన గిఫ్ట్ వోచర్ కూడా పొందొచ్చు. అంతే కాకుండా ఇంకా రివార్డు పాయింట్లు కూడా పొందొచ్చు. మూడు నెలలకు రూ.2 లక్షలకు పైన ఖర్చు చేస్తే రూ.1250 గిఫ్ట్ వోచర్ వస్తుంది. అలాగే ఫ్యూయెల్ సర్‌చార్జ్ ఫెసిలిటీ ఉంది. ఏడాదిలో రూ.75 వేలు ఖర్చు చేస్తే ఫ్యాబ్ ఫ్యామిలీ లాయల్టీ ప్రోగ్రామ్ ప్లాటినమ్ టైర్ యాక్సెస్ లభిస్తుంది.
ఇది ఇలా ఉంటే ఫ్యాబ్ ఇండియా స్టోర్‌లో ఖర్చు చేసే ప్రతి రూ.100కు 10 రివార్డు పాయింట్లు వస్తాయి. ఇతర ఖర్చులపై ప్రతి రూ.100 ఖర్చుపై 2 నుంచి 3 పాయింట్లు లభిస్తాయి. ఈ కార్డు ని ప్రీమియం సెగ్మెట్ కస్టమర్లు లక్ష్యంగా ఎస్‌బీఐ ఆవిష్కరించింది. బేస్ వేరియంట్ కార్డు జాయినింగ్ ఫీజు రూ.499గా ఉంది. దీనికి జీఎస్‌టీ అదనం. సెలెక్ట్ వేరియంట్ కార్డు తీసుకోవాలని భావిస్తే రూ.1,499 చెల్లించాలి. అదే ప్రైమ్ కార్డుకు అయితే రూ.2,999 ఫీజు ఉంది. రెన్యూవల్ చార్జీలు కూడా ఇలానే ఉన్నాయి.